Breaking News

డయల్‌ యువర్‌ సిపికి ఏడు ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి ఏడు ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌ డివిజన్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు డయల్‌ యువర్‌ సిపి ద్వారా కమీషనర్‌ కార్తికేయతో మాట్లాడారు. ఇట్టి సమస్యలపై కమీషనర్‌ స్పందిస్తు పిర్యాదుల పూర్వాపరాలు పరిశీలించి ఆయా స్టేషన్ల అధికారులకు పంపించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను డయల్‌ యువర్‌ సిపి ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ మధుసూదన్‌ ఉన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *