Breaking News
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బిగాల

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిగాల

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారంనిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా 2, 3వ డివిజన్లలో కార్పొరేటర్లతో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేవారు. కంఠేశ్వర కల్యాణ మండపంలో డివిజన్‌ ప్రజలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అందిస్తున్న పథకాలు దేశంలో పలు రాష్ట్రాలు మన తెలంగాణ పథకాలకు ఆకర్షితులై వారి రాష్ట్రాలలో కూడా కేసీఆర్‌ అందిస్తున్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

అదేవిధంగా ఇంతకు ముందు విద్యుత్‌ కొరత ఉండేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు అందిస్తున్నారన్నారు. మహిళ గర్భం దాల్చినపటినుండి (బిడ్డ పుట్టక ముందు నుండి) పెరిగి వివాహమయ్యేంత వరకు, చివరికి వృద్దాప్యంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.

పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌, రైతు బంధు, రైతు బీమా, గురుకుల స్కూళ్లు, మైనారిటీ స్కూళ్లు, డబుల్‌ బెడ్‌ రూమ్స్‌, ఇలా ప్రజలందరికి ప్రతి ముఖంలో సంతోషం ప్రతి ఇంటికి సంక్షేమం చెందేవిధంగా మన కేసీఆర్‌ కషి చేస్తున్నారన్నారు. నిజామాబాద్‌ ముద్దుబిడ్డ కెసిఆర్‌ పుత్రిక బతుకమ్మ పేరుతో పిలువబడ్డ కవిత నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగను మన రాష్ట్రంలోనే కాకుండా దేశవిదేశాలలో బతుకమ్మ పండుగను జరుపుకునే విధముగా బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన నాయకులు కవిత మరొక్కసారి ఎంపీగా మన నిజామాబాద్‌ నుండి ఫోటి చేయబోతున్నారు కావున భారీ నుండి అతి భారీ మెజారిటీతో 16 స్థానాల్లో కెల్ల ఎక్కువ మెజారిటీతో మన నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్‌ 11వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుందామని తెలియజేశారు. కార్యక్రమంలో మేయర్‌ ఆకుల సుజాత, ప్లోర్‌ లీడర్‌ ఎనుగందుల మురళి, కార్పొరేటర్లు నాయకులు దారం సాయిలు, సాయిరాం, పంచరెడ్డి సురేష్‌, రాజేష్‌, గోపరి లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *