Breaking News
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మధుగౌడ్‌

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆగడాలకు దిగితే సహించేదు

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారం అడ్డంపెట్టుకుని ఆగడాలకు దిగేతే సహించేదిలేదని కాంగ్రెస్‌ నిజామాబాద్‌ లోకసభ అభ్యర్థి మధుగౌడ్‌ యాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్‌లో జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మధుగౌడ్‌ ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని ఆరోపించారు. అక్రమకేసులు పెడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు. వీటిని ఆపకపోతే సహించేదిలేదన్నారు. కేసులు పెడుతూ వేధిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు.

కవితను ఓడించి కేసీఆర్‌ దిమ్మెతిరిగే విధంగా గుణపాఠం చెప్పాలని కోరారు. దందాలు చేసేటోళ్లకు భయమని అన్న మధుగౌడ్‌ ఎవరికి భయపడేది లేదన్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు నడుం బిగించాలని కోరారు. ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ తెరాస ప్రజాస్వామ్యపు పోకడలతో పేదలను మోసగిస్తోందని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు డాక్టర్‌ భూపతి రెడ్డి, తాహెర్‌, గడుగు గంగాధర్‌, ఆలూర్‌ గంగారెడ్డి, మహేష్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *