Breaking News

తెరాసలోకి ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాదులో ఎంపీ కవిత కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మందకష్ణ వర్గం రాష్ట్ర ఉపాధ్యక్షులు తరికెల పోశెట్టితో పాటు నందిపేట్‌ మండల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే నిజామాబాద్‌ నగర నాయకులు పంజాల శ్యాంసుందర్‌, రాంబాబు, సురేష్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ ఎంపీ కవిత గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అన్ని వర్గాలతో పాటు మాదిగల అభివద్ధికి కషి చేస్తున్న ఎంపీ కవితను బారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మార్పీఎస్‌ మందకష్ణ వర్గం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ అధికార ప్రతినిధి కొక్కెర భూమన్న, తెడ్డు గంగారామ్‌, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *