Breaking News

ఇందూరు సకల కళలకు, సాహితీ వేత్తలకు పుట్టినిల్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు నగరం శాస్త్రీయ సంగీత, నృత్య సొబగుల, కవులు, సాహితీవేత్తలకు పుట్టినిల్లని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఛైర్మన్‌ మామిడి హరికృష్ణ అన్నారు. జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల 47వ వార్షికోత్సవం ఆదివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భాషే తెలియని కాలంలోకూడా సంగీతం ఉండేదన్నారు. శోకం శ్లోకంగా మారిందని అభివర్ణించారు. ఎన్నో యుగాల పూర్వం నుంచి శ్లోకాలు పుట్టాయని పేర్కొన్నారు.

శాస్త్రీయ నృత్యం, అందాల మల్లె పందిరిలా తయారైందన్నారు. నృత్యం ఆనందంగా ఎగిరినపుడు చేతులు కదపడం, మానవ పరిణామం ద్వారా అభివృద్ది చెందిందన్నారు. అత్యంత అద్భుతంగా నాట్యకళ పరిణతి చెందిందని, ప్రాచీన కాలంలో చరిత్రలో శాస్త్రియ నృత్యం, సంగీతం గురించి ఎన్నో గ్రంథాలు వెలువడడం జరిగిందన్నారు. తెలుగు ప్రాచీన హోదాకు ఇందూరు పంపకవి ద్వారానే ఆధారం లభించిందన్నారు. బోధన్‌కు చెందిన గొప్పకవి పంపకవి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా 7వ బెటాలియన్‌ కమాండెంట్‌ సాంబయ్య, టంగుటూరి భీమన్‌, రామ్మోహన్‌రావు, డాక్టర్‌ త్రివేణి, రాజ్‌కుమార్‌ సుబేదార్‌, ప్రిన్సిపాల్‌ ప్రశాంత్‌, స్వప్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళాకారులను పాఠశాల సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

Check Also

ప్రతి జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయం రైతుకు లాభసాటిగా చేయాల‌న్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *