Breaking News

రాష్ట్రంలో నియంతత్వ పాలన

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో నియంతత్వ పాలన కొనసాగుతుందని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆరోపించారు. సోమవారం సాయంత్రం ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి ఈనెల 28వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని తెలిపారు. 2014లో సాదించిన స్థానాలకంటే ఎక్కువ స్థానాలు బీజేపీ సాధించబోతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోదని, రాష్ట్ర సమస్యలను కేంద్రం వద్ద ప్రస్తావించరని విమర్శించారు. కవితకు సీఎం కూతురు అనే అర్హత ఒక్కటే తప్ప, ఆమె చేసిన అభివద్ధి ఏమిలేదుని విమర్శించారు.

నిజామాబాద్‌ ప్రజల సమస్యలు ఆమెకు పట్టవని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చిందని హరీష్‌ రావును సీఎం కేసీఆర్‌ పక్కన పెట్టారని రాంమాధవ్‌ ఆరోపించారు. రైతులు నామినేషన్‌లు వేస్తే వాళ్లను బెదిరిస్తున్నారని, అనరాని మాటలు అంటున్నారని, ప్రభుత్వ వైఫల్యం వల్లే నిజామాబాద్‌ పార్లమెంట్‌లో మళ్ళీ పేపర్‌ బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ఐదేళ్లుగా రైతు సమస్యలు పట్టించు కోకపోవటం వల్లే రైతులు నామినేషన్‌ వేసే పరిస్థితి వచ్చిందని రాంమాధవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలన నిజాంను మించి నియంతత్వ పాలన కొనసాగిస్తుందని, కెసిఆర్‌ ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేని నేతలు కేంద్రంలో ఎలా చక్రం తిప్పుతారని రాంమాధవ్‌ ప్రశ్నించారు. చక్రం తిప్పే నేతలు.. కేసీఆర్‌, చంద్ర బాబు కాదని, దేశంలో చాలా మంది ఉన్నారన్నారు. మోడీని ఓడించాలని ప్రతిపక్షాలన్ని ఒక్కటయ్యాయని, అయినప్పటికి మళ్ళీ గెలిచేది మోడీయేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టెంట్‌ గల్లంతు కాబోతుందని, అరవింద్‌కు ఉన్న ఆవేదనలో 10 శాతం ఎంపీ కవితకు ఉంటే పసుపు రైతుల సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదన్నారు. అన్ని పంటలు పండించే రైతులకు న్యాయం చేస్తామని, మార్కెటింగ్‌ డెఫినషన్‌ స్కిం ప్రవేశ పెడతామని ఆయన చెప్పారు. నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అంశం బీజేపీ మ్యానిఫెస్టోలో చేరుస్తున్నామని రాంమాధవ్‌ తెలిపారు. బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి, కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి, అల్జాపూర్‌ శ్రీనివాస్‌, యెండల లక్ష్మినారాయణ, పార్టీ జిల్లా అద్యక్షుడు గంగారెడ్డి, బస్వా లక్ష్మినర్సయ్య, టక్కర్‌ హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *