Breaking News
నామినేషన్‌ వేయడానికి వచ్చిన రైతులు

రికార్డు స్థాయిలో నామినేషన్‌లు

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌ సభకు రికార్డ్‌ స్థాయిలో నామినేషన్‌లు దాఖలయ్యాయి. సోమవారం చివరి రోజు కావడంతో ఒక్క రోజే 179 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. బయటకు గంభీరం ప్రదర్శిస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. రైతులు నామినేషన్‌ విషయంలో మొదట్లో ఉదాసీనంగా వ్యవరించినా మొత్తం 242 నామినేషన్లు దాఖలయ్యాయి.

దీంతో ప్రధాన పార్టీలు ఖంగుతున్నాయి. మొత్తం నామినేషన్లు 247 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. మార్చి 20న ఏడుగురు, మార్చి 22న 56 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 242. దీంతో నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్స్‌ ఉపసయోగిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ వెల్లడించారు. దీంతో నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దష్టిని ఆకర్షిస్తోంది. రైతులు నామినేషన్‌ ఉపసంహరించుకునేలా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *