Breaking News
బహిరంగ సభ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే షకీల్‌

ఎంపీ కవిత సభ విజయవంతం చేయండి

రెంజల్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పార్లమెంట్‌ సభ్యురాలు కవిత బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాటాపూర్‌లో మార్కెట్‌ గ్రౌండ్లో ఉదయం 8:30 గంటలకు ఎంపీ కవిత భారీ బహిరంగ సభకు మండలంలోని ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తరలివచ్చి సభ విజయవంతం చేయాలన్నారు. దేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కురాలుగా ఎంపీ కవిత గుర్తింపు పొందారని కవితను రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఎలా సష్టించారో పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా 16 స్థానాలకు గాను 16 స్థానాలు గెలిచి తీరాలని, రాష్ట్రాన్ని సాధించినట్లుగానే ఢిల్లీని శాసించాలని అన్నారు. ఢిల్లీని శాసించాలంటే కవిత ఎంపీగా గెలవాలని మన ఎంపీ కవితక్కను గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేడు జరిగే బహిరంగ సభకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధికంగా తరలివచ్చి సభ విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, మైనార్టీ జిల్లా సభ్యులు రఫీక్‌, సాటాపూర్‌ సర్పంచ్‌ వికార్‌ పాషా, జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు కాశం సాయిలు, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యులు మౌలానా, టిఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ శంకర్‌, కుర్మె సాయిలు, దత్తుపటేల్‌, రవీందర్‌ గౌడ్‌, సాయిబాబా గౌడ్‌, హాజిఖాన్‌, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *