Breaking News

వెంకటేశ్వర హీరో ఆధ్వర్యంలో సేల్స్‌ కార్నివాల్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో సోమవారం వెంకటేశ్వర హీరో వినాయక్‌నగర్‌ వారి ఆధ్వర్యంలో సేల్స్‌ కార్నివాల్‌ నిర్వహించడం జరిగింది. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడానికి వర్నిరోడ్డు చౌరస్తాలోని గంప కాంప్లెక్సులో మూడురోజుల పాటు సేల్స్‌ కార్నివాల్‌ ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ యూనియన్‌ బ్యాంకు నిజామాబాద్‌ మేనేజర్‌ యుగందర్‌ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్నివాల్‌ సోమవారం నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ప్రతి హీరో వాహన కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో షోరూం యజమాని మహిపాల్‌రెడ్డి, వినియోగదారులు, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *