Breaking News
నామినేషన్‌ అనంతరం మాట్లాడుతున్న బాణాల

జహీరాబాద్‌ బిజెపి ఎంపి అభ్యర్థిగా బాణాల నామినేషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా సోమవారం బాణాల లక్ష్మారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దేశంలో గత ఐదేళ్లలో మోడిచేసిన సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల తెరాస పాలనలో ఎంపి, ఎమ్మెల్యేల స్థాయిలో తెరాస నాయకులు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. కనీసం స్థానికంగా ఉండని నేతలు ఇక ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. బిజెపి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా చేపట్టామని, ప్రజలు వాటి లబ్ది పొందుతున్నారన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కేంద్రంలో మోడిని తిరిగి గెలిపిస్తారని పేర్కొన్నారు. కళ్లబొల్లి మాటలు చెప్పే నాయకుల ఓటమి ఖాయమని పేర్కొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *