Breaking News

Daily Archives: March 26, 2019

జిల్లాకు చేరుకున్న ఎన్నికల కమిషన్‌ సాధారణ పరిశీలకులు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్‌ లోకసభకు భారత ఎన్నికల కమిషన్‌ సాధారణ పరిశీలకునిగా నియమించిన డాక్టర్‌ గౌరవ్‌ దాహియ మంగళవారం సాయంత్రం జిల్లాకు చేరుకున్నారు. గుజరాత్‌ రాష్ట్ర కేడర్కు చెందిన 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సాధారణ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌, బోధన్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలపై పరిశీలించనున్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యయ పరిశీలకులు జిల్లాకు వచ్చారు. జిల్లాకు ...

Read More »

రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఓ భర్త మతి

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసమ్మ భర్త పుట్ట కష్ణ మంగళవారం రెంజల్‌ ప్రాంతంలో మోటర్‌ సైకిల్‌ అదుపు తప్పి మతి చెందినట్లు ఎస్సై శంకర్‌ తెలిపారు. సంఘటన స్థలాన్నీ బోధన్‌ రూరల్‌ సిఐ షాకిర్‌ అలీ పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను ఎస్సై శంకర్‌ని అడిగి తెలుసుకున్నారు. మతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆస్పత్రికి ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల కేటాయింపు

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ మరో మూడు అదనపు పోలీంగ్‌ కేంద్రాలకు జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలను మంగళవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి రాజకీయ పార్టీల సమక్షంలో కేటాయించారు. స్ట్రాంగ్‌ రూం నుంచి రిజర్వు ఈవిఎం, వీవీప్యాట్‌ల నుంచి సప్లమెంటరీ ర్యాండమైజేషన్‌ ద్వారా 6 కంట్రోల్‌ యూనిట్లు, 9 వీవీప్యాట్లు, 6 బ్యాలెట్‌ యూనిట్లను కేటాయించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఆయాపార్టీల నాయకులు అక్రమ్‌, ...

Read More »

పది కేంద్రాల పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పట్టణంలోని ఆర్కిడ్‌ స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్నతీరు, తీసుకున్న చర్యలు, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

Read More »

కలెక్టరేట్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నిర్మితమవుతున్న కలెక్టరేట్‌ కాంప్లెక్సు భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలన్నారు. వివిధ విభాగాలకు కేటాయించిన ఫ్లోర్‌లను సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట జిల్లా రోడ్లు, భవనాల శాఖ ఎ.ఇ. మహేందర్‌, డిప్యూటి ఎ.ఇ. శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సుధీర్‌, మోహన్‌ సిబ్బంది ఉన్నారు.

Read More »

టౌన్‌ ప్లానింగ్‌ అధికారులపై చర్యల కోసం ఆర్డీవోకు వినతి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఎంసిపిఐయు నాయకులు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ కామారెడ్డిలోని రైల్వే గేటు చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదురుగా ప్రధాన కూడలిలో ప్రకాశ్‌అనే వ్యక్తి చేపడుతున్న నిర్మాణం భవిష్యత్తులో ట్రాఫిక్‌ పెరుగుదల దృష్ట్యా కొంతభాగం వదిలి నిర్మాణం చేపట్టాలని చెప్పినా అనుమతి లేకుండా పనులు ...

Read More »

పేషెంట్ల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అవుట్‌ పేషెంట్ల రద్దీని తట్టుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి పట్టణ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఏరియా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కొత్తగా నిర్మితమైన భవనాలను అవుట్‌ పేషెంట్ల విభాగానికి వినియోగించి ఆరోగ్య నేస్తం సిబ్బందితో పేషెంట్ల రద్దీని తట్టుకునేలా చూడాలని సూచించారు. 8 పడకల టెర్మినల్లి ఇల్‌ పేషెంట్‌ ...

Read More »

ఎంపీ కవితకు ట్రస్మా సంపూర్ణ మద్దతు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోవు లోక్‌ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో గెలిపించడానికి ట్రస్మా కంకణం కట్టుకుందని ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్‌ రావు వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 వేల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వారి కుటుంబాలు అదేవిధంగా సిబ్బంది వారి కుటుంబాలు దాదాపు 35 ...

Read More »

కేంద్ర ప్రభుత్వం మోసం

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నిజామాబాద్‌ ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ కవిత పసుపు బోర్డ్‌ ఏర్పాటు గురించి అస్సాం రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పదించలేదని అన్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్యేలందరం, ...

Read More »

తెరాస ఎంపిలతో అభివృద్ధి

ఆర్మూర్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి కవితకి మద్ధతుగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాపూర్‌, గోనుగొప్పుల గ్రామంలో మహిళలు మంత్రికి బోనాలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో తనను గెలిపించి నన్ను మంత్రిని కేసీఆర్‌ని సీఎం చేసినందుకు ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే ఆదరించారో అలాగే రేపు జరుగబోయే ...

Read More »

తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం

బీర్కూర్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని సంభపూర్‌ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం గ్రామస్తులు ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో త్రాగు నీటికి ఇబ్బందిగా ఉందని పలు మార్లు అధికారులకు, నాయకులకు తెలిపినా పట్టించుకునే పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కోసం పంట పొలాల బోర్ల వద్దకు వెళుతున్నామన్నారు. ...

Read More »

ఢిల్లీకి పంపండి గల్లీలో సేవచేస్తా

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 65 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనను అణచి వేసి ప్రత్యేక తెలంగాణను సాధించి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ పార్టీ ఆనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మరింత ముందుకు సాగాలంటే ఢిల్లీ మెడలు వంచి ఢిల్లీని శాసించే దమ్ము తెలంగాణ వాళ్ళకె ఉందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎన్నికల ప్రచార ...

Read More »

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరిక

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు సుమారు 150 మంది, వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఉపసర్పంచ్‌, మాజీ విండో ఛైర్మన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మంగళవారం సాటాపూర్‌లో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమారెడ్డి, మైనార్టీ ...

Read More »

కదిలిన గులాబీ దండు

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపి కల్వకుంట్ల కవిత బహిరంగ సభకు తాడ్‌ బిలోలి గ్రామం నుండి 700 మంది టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, తెలంగాణ శంకర్‌ ఆధ్వర్యంలో భారీగా గులాబీ దండు కదలి వచ్చింది. సాటాపూర్‌ చౌరస్తాలో మండల అధ్యక్షుడు భూమారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బహిరంగ సభవరకు ప్లకార్డులతో ర్యాలీగా తరలి రావడంతో గులాబీ దళం గుబాలించింది. ...

Read More »

కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ ఏర్పాటు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయిందని పార్టీ సీనియర్‌ నాయకులు సందీప్‌ దీక్షిత్‌ అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్‌ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సోనియా గాంధీ నేతత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కష్టపడిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ కషి ఎనలేనిదని, తన దగ్గరికి మధుయాష్కీ వచ్చి తెలంగాణ సమస్యలు వివరించగా చలించిపోయానన్నారు. తాను తెలంగాణ ...

Read More »

తెరాస రైతు పక్ష పాతి

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతు పక్ష పాతిఅని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. మంగళవారం ఆమె బోధన్‌ నియోజక వర్గంలో ఎమ్మెల్యే షకీల్‌ ఆమిర్‌తో కలిసి ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. రెంజల్‌ మండలం సాటాపూర్‌, ఎడపల్లి మండల కేంద్రాలలో ఆమె బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు తెలంగాణలో రైతులకు కరెంటు ఇస్తున్నామని, రైతుభీమా, రైతుబందు పథకాలతో రైతన్నలకు సిఎం ...

Read More »

దివ్యాంగులకు మనోవికాస విజ్ఞాన విహార యాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని భీమ్‌గల్‌, దర్పల్లి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాలలో గల డిఆర్‌డిఎ ఆద్వర్యంలో నిర్వహించబడుచున్న దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు చెందిన పిల్లలను వారి మనో వికాసానికై అలిసాగర్‌కు విజ్ఞాన విహారయాత్రకు తీసుకువెళ్లడం జరుగుతుంది. కార్యక్రమంలో (5) మండలాలకు చెందిన పిల్లలు, సిబ్బంది, ప్రొఫెషనల్స్‌, ఏ.పి.యం. గంగాధర్‌, డి.పి.యం. సాయిలు పాల్గొనడం జరిగినది. విహారయాత్ర బస్సులను డిఆర్‌డిఎ రాథోడ్‌ రమేష్‌ జెండాఊపి యాత్ర ప్రారంభించారు.

Read More »