Breaking News

Daily Archives: March 27, 2019

పసుపు రైతుకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు పోరాటం

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేంతవరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, కనీస మద్దతు ధర ప్రకటనతో పసుపు రైతుల కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. కేంద్రంపై మీతో కలిసి మీ సోదరిగా పోరాటం చేస్తానని, పసుపు బోర్డు ఇవ్వాలనుకుంటే ఇన్నాళ్లు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నానని, ఎన్నికల్లో లబ్ది పొందాలని బిజెపి ఆలోచిస్తోందని విమర్శించారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గంలోని రెంజర్ల, మెండోర, ...

Read More »

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్త శ్రీరామ గార్డెన్‌లో బూత్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌ నగరంని బూత్‌ కమిటీ సభ్యులతో అర్బన్‌ ఎమ్మెల్యే మాట్లాడారు. ఇంతకు ముందు ఎన్నికల్లో ఏవిధంగా పని చేశామో దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రతి బూత్‌ కమిటీ మెంబర్‌ వారి వారి డివిజన్లలో ప్రతి గడప గడపకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని తెలుపుతూ ప్రతి రోజు ఎన్నికల ప్రచారం చేయాలని ...

Read More »

దేశం కోసం మోడి… నిజామాబాద్‌ కోసం అర్వింద్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశం కోసం నరేంద్రమోడిని, నిజామాబాద్‌ కోసం అర్వింద్‌ ధర్మపురిని గెలిపించాలని నిజామాబాద్‌లో 9వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు యెండల సుధాకర్‌, బిజెవైఎం నగర అధ్యక్షులు, డివిజన్‌ ఇంఛార్జి రోషన్‌ లాల్‌ బోర ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేస్తే రాహుల్‌ గాంధీ కుటుంబానికి లాభం, టిడిపికి ఓటేస్తే వారి కుటుంబానికి లాభం, మోడీకి ఓటేస్తే దేశానికి, మన పిల్లల భవిష్యత్‌కి లాభమని పేర్కొన్నారు. ...

Read More »

ఎన్నికలకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్లు స్వీకరణ పూర్తయినందున తదుపరి ఏర్పాట్లను చూసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. ఓటర్‌ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొత్త ఓటర్లకు ఎపిక్‌ కార్డుల పంపిణీకి, వాటి ముద్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. సువిధకు వచ్చే దరఖాస్తులకు ...

Read More »

అవకాశమివ్వండి అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని బిజెపి ఎంపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి, నీలా, సాటాపూర్‌, రెంజల్‌ గ్రామాల్లో బుధవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా కందకుర్తి త్రివేణి సంగమంలో స్నానమాచరించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రచారంలో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. తిరిగి బిజెపిని గెలిపిస్తే మరింత అభివృద్ది ...

Read More »

‘ఓటరు అనే నేను’ లఘుచిత్రం పోస్టర్‌ విడుదల

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భాస్కర్‌ ప్రొడక్షన్స్‌లో భాస్కర్‌ ఐతా, వెంకటలక్ష్మి ఐతా నిర్మాతలుగా, రవిశ్రీ పారిపల్లి స్వీయ దర్శకత్వంలో, సుధాకర్‌ సినిమాటోగ్రాఫర్‌ శ్రీకాంత్‌ బెజుగాం ఎడిటర్‌ శ్రీకాంత్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, భాద్యతలు నిర్వహిస్తూ రూపొందించిన ఓటరు అనే నేను లఘుచిత్రం పోస్టర్‌ ఈరోజు వినాయక్‌ నగర్‌లో కార్యాలయంలో విడుదలైంది. ఓటరులలో చైతన్యం తీసుకురావడానికి భాస్కర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నుంచి వస్తున్న లఘుచిత్రం అని, తక్కువ సమయంలో అత్యద్భుతంగా తీసామని, ఆదరించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిదని నిర్మాత భాస్కర్‌ ...

Read More »

ప్రజల వెంటే ఉంటా : దీవించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ స్తానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టు జర్నలిస్టు శివకుమార్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాసేవకే తాను ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, ఎంపిగా గెలిచిన తర్వాత కూడా సమస్య ఎక్కడుంటే అక్కడికి వస్తానని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మీతో కలిసి దొడ్డు బువ్వ అయినా సరే, ఉడుకుడుకు బువ్వ అయినా సరే ఎల్లిగడ్డ కారమైనా సరే తిని మీ కాడ్నే ఉండి ...

Read More »

జనసేన నిజామాబాద్‌ ఎంపి అభ్యర్థిగా బుస్సాపూర్‌ శంకర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బుస్సాపూర్‌ శంకర్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసినట్టు తెలిపారు. బుధవారం నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేస్తానని తెలిపారు. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, ఐదు సంవత్సరాల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజాసమస్యలు పట్టించుకోలేదని, ...

Read More »

29న దళిత న్యాయవాదుల సదస్సు

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 29న దళిత న్యాయవాదుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు ఎస్‌సి, ఎస్‌టి అడ్వకేట్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు దేవిదాస్‌ చాండక్‌, ప్రధాన కార్యదర్శి చిన్యా నాయక్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళిత, గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి, చట్టాలపై అవగాహన కల్పించడానికి వీలుగా సదస్సు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎస్‌సి కమీషన్‌ జాతీయ సభ్యులు రాములు, గౌరవ ...

Read More »

లక్ష్మీ నరసయ్యకు హరిదా రంగస్థల పురస్కార ప్రదానం

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంస్క తిక ప్రక్రియలలో నాటక రంగం అన్ని కళల సమాహారంగా ప్రేక్షకులను రంజింప చేస్తుందని నిజామాబాద్‌ పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు ముర్తుజా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాటక రంగ అభివద్ధికి కషి జరుగుతున్నదని, అందులో భాగంగానే తెలంగాణ సంగీత నాటక అకాడమీ బాద్మి శివ కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ నాటక రంగం ప్రపంచ నాటక చరిత్రలో గొప్ప స్థానాన్ని అలంకరించడానికి రచయితలు, నటులు, దర్శకులు ...

Read More »

పిఆర్‌టియు సభ్యుల కృషితోనే రగోత్తమ్‌రెడ్డి విజయం

బీర్కూర్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌,నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఏమ్మెల్సీ స్థానానికి పిఆర్‌టియు బలపరిచిన కూర రగోత్తమ్‌ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఈ విజయం ప్రతిఒక్క పిఆర్‌టియు సబ్యులకు చెందుతుందని తెలియజేస్తూ స్థానిక ఉన్నత పాఠశాలలో పిఆర్‌టియు నాయకులు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు కొర్రి విట్టల్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు గుండం నర్సింలు, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్‌ జెట్టి, మండల అసోసియేషన్‌ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, సంతోష్‌, ...

Read More »

నామినేషన్లు సమస్యకు పరిష్కారమా…

సంపాదకీయం లోక్‌సభ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పసుపు, ఎర్రజొన్న రైతులు నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం వరకు 202 మంది అభ్యర్థులకుగాను 245 నామినేషన్లు దాఖలు అయినట్టు సమాచారం. అయితే ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడమనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి కూడా కారణమేమంటే 46 మందిఅభ్యర్థుల కంటే ఎక్కువ మంది నామినేషన్‌ వేయడం వల్ల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో కాకుండా బ్యాలెట్‌ ద్వారా పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. 15 ...

Read More »