Daily Archives: March 28, 2019

మండుటెండలో పండువెన్నెల చందంగా నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రచారం

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రచారం మండుఎండలో పండు వెన్నెల చందంగా సాగిపోతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ పొలిమేర ల్లోనే టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. బైక్‌ ర్యాలీలు సరే సరి. మహిళలు బొట్టు పెట్టి తమ ఆడపడుచు ఊరికి వచ్చిందనీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆమెతో కలిసి నడుస్తున్నారు. బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతున్నారు. కొందరు అభిమానులు బంతి పూల రెమ్మలని ఆమెపై చల్లుతూ తమ అభిమానాన్ని ...

Read More »

వాళ్ళకు ఓట్లు వేసి.. వేసి మన ఓట్లు మురిగిపోయాయి

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నల్లవెల్లి ఎన్నికల సభలో ఎంపి కవిత నిజామాబాద్ న్యూస్‌.ఇన్ఃకాంగ్రెస్‌, బిజెపి పార్టీలకు ఓట్లు వేసి..వేసి మన ఓట్లన్నీ మురిగిపోయాయి తప్ప మనకు జరిగిన మేలు ఏమీ లేదని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజక వర్గంలోని ఇందల్‌వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. మన తలరాతలు మారుస్తారని, దేశాన్ని అభివద్ధి పథంలోకి తీసుకువెళతారని ఆ రెండు పార్టీలకు ఓట్లేసి అధికారం అప్పగిస్తే, వారు చేసిందేమి లేదన్నారు. ప్రపంచంలో మన ...

Read More »

నిజామాబాద్‌ నియోజకవర్గానికి కూడా ఏప్రిల్‌ 11నే పోలింగ్‌…??

నిజామాబాద్‌, మార్చ్‌ 28 బాలట్ బాక్సులకు టెండర్ సన్నాహాలు 16 పేజీలు ఉండబోతున్న బ్యాలట్ పత్రం మెటల్ బాలట్ బాక్సులకు ప్రాధాన్యం. చెక్క తో చేసిన బాలట్ బాక్సులను కూడా పరిశీలన.అనుకున్న తేదీ ఏప్రిల్ 11 న ఎలక్షన్ జరిపించాలని పట్టుదలతో రాష్ట్ర ఎన్నికల కమీషన్. నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం నామినేషన్ల విషయంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. 202 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు దాఖలు చేసి సంచలనం ...

Read More »

29న బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో మధుయాష్కి సమావేశం

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం 29న ఉదయం 11.30 గంటలకు జిల్లా కేంద్రంలోని బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదులతో మాజీ ఎంపి, కాంగ్రెస్‌ అభ్యర్తి మధుయాష్కీ సమావేశమవుతారు. అనంతరం డిచ్‌పల్లి కెఎన్‌ఆర్‌ గార్డెన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్‌ రూరల్‌ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని డీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్‌ గౌడ్‌ తెలిపారు. కావున కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

Read More »

జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన సాధారణ పరిశీలకులు గౌరవ్‌ దాలియా జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావును కలుసుకున్నారు. గురువారం కలెక్టర్‌ చాంబర్లో ఆయన కలెక్టర్‌తో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సిబ్బంది, నియామకం, ఓటర్లకు సదుపాయాలు తదితర విషయాలపై ఇతర విషయాలపై చర్చించారు. గౌరవ్‌ దాలియా గుజరాత్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

Read More »

క్షయ వ్యాధి గురించి అవగాహన అవసరం

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ క్షయవ్యాధి నియంత్రణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం హాజరై మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2930 మంది క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించడం జరిగిందని వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ర్యాలీ ప్రారంభిస్తున్న అధికారులు అదేవిధంగా ప్రధాన మంత్రి కౌశల్‌ పథకం ...

Read More »

నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి కార్తికేయ

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్మూర్‌, బోధన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌, రిజర్వు విభాగాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై సమీక్షించారు. రాబోవు పార్లమెంటు ఎన్నికల దృస్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరు పాటించేలా చూడాలని, గ్రామస్థాయి సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. త్వరలో జరగబోవు పార్లమెంటు ఎన్నికలపై సంబందిత అధికారులు తీసుకున్న ముందస్తు ...

Read More »

అభ్యర్థులకు గుర్తుల వివరాలు వివరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌ సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మిగిలిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించిన వివరాలను నిజామాబాద్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పోటీలో నున్న అభర్తులకు వివరించారు. గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో గుర్తులను కేటాయించిన వివరాలను వారికి తెలియజేశారు. ముందుగా జాతీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు కేటాయింపు, తదుపరి గుర్తింపు పొందిన రిజిస్టర్‌ కాని పార్టీల తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను వివరించారు. ఈ ...

Read More »

రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే చిన్న చూపు

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వానికి మహిళలంటే చిన్న చూపు అని అందుకే మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వలేదని రాష్ట్ర మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నెరేళ్ల శారదా విమర్శించారు. గురువారం నగరంలోని గాజులపెట్‌ తదితర ప్రాంతాల్లో లోకసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధుగౌడ్‌ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధిదని మహిళగా తెలంగాణలో అమరుల త్యాగాలకు చలించి ...

Read More »

ఎంపి కవితకు మద్దతుగా బిసి విద్యార్థి సంఘం

ఆర్మూర్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం బీసిలకు అనేక రకాలుగా అభివద్ధి చేసిందని, గత ప్రభుత్వాలు చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలు బీసిల కోసం ప్రవేశపెట్టిందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్‌ యాదవ్‌ అన్నారు. గురువారం అర్మూర్‌లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ మరియు కళాశాల వసతి గహంలో మెస్‌ చార్జీలు పెంచడం, బీసీ హాస్టల్‌లో సన్న బియ్యం, రాష్ట్రంలో 119 కొత్తగా బీసీ గురుకులాలు, విదేశాలలో చదువుకోవడానికి ...

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ జెడ్పిటిసి వినయ్‌ కుమార్‌ సూచించారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అంబలి చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ ...

Read More »

తెరాసకు బీర్కూర్‌ మండలం నుంచి భారీ మెజార్టీ ఇస్తాం

బీర్కూర్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీర్కూర్‌ మండలం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి భారీ మెజార్టీ సాధిస్తామని, ఏప్రిల్‌ 11న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బి.బి.పాటిల్‌కు బీర్కూర్‌ మండలం నుండి భారీ మెజార్టీ సాధించి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బహుమతి ఇద్దామని మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండల కేంద్రం బీర్కూర్లో తెరాస మండల కార్యకర్తల సమావేశం మున్నూరుకాపు సంఘంలో మండల పార్టీ అధ్యక్షుడు రఘు అధ్యక్షతన ...

Read More »

ప్రచారంలో దూసుకుపోతున్న అర్వింద్‌ ధర్మపురి

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్ధి అర్వింద్‌ ధర్మపురి ప్రచారానికి అద్భుతమైన స్పందన వస్తోంది. గురువారం నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ధర్పల్లి, సిరికొండ మండలాల మీదుగా డిచ్‌పల్లి వరకు సాగిన రోడ్‌షోకు అడుడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు బోర్డు పెట్టించడం, మూత పడిన చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించడంతో కొత్తవి కూడా పెట్టిస్తానని అర్వింద్‌ హామీ ఇచ్చారు. 2022లోపు నిజామాబాద్‌ పార్లమెంట్‌ లక్ష ఇండ్లు కట్టించి ...

Read More »

చివరికి 185 మంది బరిలో…

నిజామాబాద్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న, పసుపు రైతులు లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నియోజకవర్గానికి భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 202 మంది అభ్యర్థులు మొత్తం 245 నామినేషన్లు దాఖలు చేసి సంచలనం సృష్టించాలనుకున్నారు. కానీ స్క్రూటినీ అనంతరం 189 మంది అభ్యర్థులకు గాను 28వ తేదీ గురువారం సాయంత్రం వరకు 185 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. దీంతో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలతో కాకుండా బ్యాలెట్‌తో పోలింగ్‌ జరగబోతుంది.

Read More »