Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న తెరాస నాయకులు

తెరాసకు బీర్కూర్‌ మండలం నుంచి భారీ మెజార్టీ ఇస్తాం

బీర్కూర్‌, మార్చ్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల్లో బీర్కూర్‌ మండలం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి భారీ మెజార్టీ సాధిస్తామని, ఏప్రిల్‌ 11న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి బి.బి.పాటిల్‌కు బీర్కూర్‌ మండలం నుండి భారీ మెజార్టీ సాధించి సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బహుమతి ఇద్దామని మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్‌ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండల కేంద్రం బీర్కూర్లో తెరాస మండల కార్యకర్తల సమావేశం మున్నూరుకాపు సంఘంలో మండల పార్టీ అధ్యక్షుడు రఘు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా సతీష్‌ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ యువ నాయకులు, దేశాయిపేట పిఏసిఎస్‌ అధ్యక్షులు పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అందరం కలిసి కట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుండామని, దీనికోసం కషి చేద్దామని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికునిలాగా పనిచేద్దామని తెలిపారు. అదేవిధంగా 30వ తేదీన నసురుల్లాబాద్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద జరిగే బి.బి.పాటిల్‌ ఎన్నికల ప్రచార సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేద్దామని తెలిపారు. ఏప్రిల్‌ 3న జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లా దుర్గా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారని అట్టి సభకు మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు హాజరు కావాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బీర్కూర్‌ పార్టీ అధ్యక్షుడు దుంపల రాజు, మండల రైతు సమన్వయ అధ్యక్షుడు అశోక్‌, బీర్కూర్‌ ఎంపీటీసీ సుధాకర్‌ యాదవ్‌, మైలారం పిఏసిఎస్‌ అప్పారావు, జిల్లా మత్య్సకార అధ్యక్షుడు సాయిబాబా, రైతునగర్‌ సర్పంచ్‌ నాగేశ్వర్‌ రావు, కిష్టపూర్‌ సర్పంచ్‌ బాబురావు, బీర్కూర్‌ మాజి సర్పంచ్‌ నర్సన్న, మాజి ఎంపీపీ విజయ ప్రకాష్‌, మాజి పిఏసిఎస్‌ కొల్లి గాంధీ, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు అవారి గంగారాం, పోశెట్టి, శివరాజు, మేకల పవన్‌, నర్సింలు, యట వీరేశం, యువ నాయకులు, అంజ గౌడ్‌, సాహెబ్‌ రావు, శశికాంత్‌, మాజి వార్డ్‌ సభ్యుడు రఘు, మారుతి ,మండలంలోని అన్ని గ్రామాల పార్టీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మహిళ దుర్మరణం

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *