Breaking News

Daily Archives: March 29, 2019

టిఆర్‌ఎస్‌లో చేరిన బీఎస్పీ జిల్లా కమిటీ నేతలు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజ్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా కమిటీ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం రాత్రి నిజామాబాద్‌లోని బందావన్‌ గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా కమిటీ నేతలంతా ఎంపి కవిత సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కవిత. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భీమ్‌ రావ్‌ గైక్వాడ్‌, ప్రధాన కార్యదర్శి మొత్కు ముత్తన్న, ఉపాధ్యక్షులు ఎర్ర యాదగిరి, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ అలీ, కార్యదర్శి అంబీర్‌ బోజారావు, ...

Read More »

బిజెపి అంటే.. భారతీయ జూటా పార్టీ

నిజామాబాద్‌, మార్చ్‌ 29 టిఆర్‌ఎస్‌వి సమావేశంలో ఎంపీ కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి అంటేనే భారతీయ జూటా పార్టీ అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్వచించారు. శుక్రవారం నిజామాబాదులో టిఆర్‌ఎస్‌ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్‌ఎస్‌వి నిజామాబాద్‌ జిల్లా సమావేశం జరిగింది. విద్యార్థులనుద్దేశించి ఎంపీ కవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు నరేంద్ర మోడీ చాలా చెప్పారని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటివరకు ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పడంలేదని ఎంపి ...

Read More »

ఎంపీ కవితకు గౌడ సంఘం మద్దతు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు గౌడ సంఘం మద్దతు ప్రకటించింది. శుక్రవారం కంఠేశ్వర్‌ న్యూ హౌసింగ్‌ బోర్డ్‌ కాలని కమ్యూనిటీ హాల్‌లో గౌడ సంఘం సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి ఎంపి కవిత మాట్లాడుతూ గౌడ సంఘం గులాబీ సైన్యంగా మారిందని, తనకు ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. చెట్టు పన్ను రద్దు చేసుకొని, ఈత వనాలను పెంచుతూ మీ సంపదను సష్టించడం కోసం ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గౌడ వత్తిని ...

Read More »

తెరాసలోకి రిపబ్లిక్‌ యూత్‌ ఫోర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాసలో రిపబ్లిక్‌ యూత్‌ ఫోర్స్‌ సభ్యులు చేరారు. శుక్రవారం ఎంపి కవిత క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిపబ్లిక్‌ యూత్‌ ఫోర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొండ విజయ్‌తో పాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌ చేరారు. వారందరికీ ఎంపీ కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్‌ నుంచి ఎంపీ కార్యాలయం వరకు భారీ బైక్‌ ర్యాలీ, బ్యాండ్‌ మేళాతో విజయ్‌ తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ ...

Read More »

తెరాసలోకి అరికెల

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అరికెల నర్సారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటీఆర్‌ అద్వర్యంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సమసక్షంలో అరికెల తెరాస కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కెటీఆర్‌ అరికెలకు పుష్పగుచ్చం ఇచ్చి పార్టిలోకి స్వాగతించారు.

Read More »

తెరాసలోకి పలువురు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 43వ డివిజన్‌కు చెందిన మొబైల్‌ షాప్‌ల సంఘం అధ్యక్షుడు అనిల్‌ యాదవ్‌తో పాటు ఆయన అనుచరులు 500 మంది ఎంపీ కవిత సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం కంఠేశ్వర్‌ న్యూ హౌసింగ్‌ బోర్డు కాలని కమ్యూనిటీ హాలులో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎంపి కవిత గులాబి కండువాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ ఐదేళ్ల కింద నాకు ఓట్లేసి పార్లమెంట్‌కు పంపారని, శక్తి వంచన లేకుండా పని ...

Read More »

ఢిల్లీ మెడలు వంచి కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకుందాం

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ నుంచి 16 మంది తెరాస ఎంపిలను గెలిపించి ఢిల్లీకి పంపితే ఢిల్లీ నాయకుల మెడలు వంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చుకుందామని తెరాస పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. శనివారం ఆయన సమక్షంలో పలువురు నాయకులు తెరాసలో చేరిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంపిలను గెలిపిస్తే రాహుల్‌ గాంధీకి లాభమని, బిజెపి ఎంపిలను గెలిపిస్తే మోడికి లాభమని, అదే తెరాస ఎంపిలను గెలిపిస్తామని తెలంగాణ గడ్డకు లాభమన్నారు. ...

Read More »

కెటిఆర్‌ సమక్షంలో తెరాసలోకి పలువురు

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జడ్పిటిసి సభ్యుడు నిమ్మ మోహన్‌రెడ్డి, వడ్లూర్‌ ఎంపిటిసి మర్కంటి శంకర్‌, పట్టణ 14వ వార్డు కౌన్సిలర్‌ నిమ్మ దామోదర్‌రెడ్డిలు శుక్రవారం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ మర్రి గ్రామస్టేజి వద్ద ప్రచారంలో ఉన్న కెటిఆర్‌ సమక్షంలో వారు తెరాస కండువా వేసుకున్నారు. రాష్ట్రంలో కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై కాంగ్రెస్‌ను వీడి ...

Read More »

బీర్కూరులో సర్పంచుల సమావేశం

బీర్కూర్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరా క్రాంతి పథకం కార్యాలయంలో బీర్కూర్‌ నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలాలలో శుక్రవారం నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు కార్యదర్శులతో మిషన్‌ భగీరథపై సమావేశం నిర్వహించినట్టు బీర్కుర్‌ ఎంపీడీవో హరిసింగ్‌ నాయక్‌ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలాలలో నూతనంగా మిషన్‌ భగీరథ ద్వారా ఏర్పాటు చేస్తున్న త్రాగునీటి సౌకర్యం కొరకు కుళాయిల ద్వారా వచ్చే కలుషిత నీటిని సేవించకుండా మండలాలలో గల పలు గ్రామాల సర్పంచులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ...

Read More »

బిల్లు కట్టకుంటే కిడ్నీలు తీసుకుంటాం

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో శ్రీ కష్ణ న్యూరో హాస్పిటల్‌ నిర్వాకం నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యక్ష దేవుళ్లు అని ప్రతి మనిషి భావించే వైద్యులే మనుషుల పాలిట రాక్షసుల మారుతున్నారు. భీమ్‌గల్‌కు చెందిన అల్లురి రాజేందర్‌ గత 13 రోజుల కింద గాయాలపాలుకాగా అతని బంధువులు నిజామాబాద్‌ శ్రీక్రిష్ణ న్యూరో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. 13 రోజులుగా చికిత్స పొందుతున్న రాజేందర్‌ కోలుకున్నట్లు శుక్రవారం డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు బంధువులకు తెలిపారు. దీంతో ఆసుపత్రికి చేరుకున్న ...

Read More »

గెలిచిన వెంటనే పసుపు బోర్డు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గెలిచిన వెంటనే నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అబ్యర్తి అర్వింద్‌ ధర్మపురి తెలిపారు. శుక్రవారం జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్లు కట్టించి మహిళా తల్లులకు ఇస్తానని, ఎంపీ ఆఫీస్‌లోనే ఎన్‌ఆర్‌ఐ సెల్‌ పెట్టి గల్ప్‌ బాధితులకు సాయం చేస్తామన్నారు. మీడియాను మేనేజ్‌ చేసినట్టు సోషల్‌ మీడియాను చేయలేరన్నారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో రోడ్‌షోతో పాటు, ...

Read More »

తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర కీలకం

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ కొరకు జరిగిన పోరాటంలో న్యాయవాదుల పాత్ర చారిత్రాత్మకమైనదని మాజి ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ అన్నారు. తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర పట్ల తోటి న్యాయవాదిగా గర్విస్తున్నానన్నారు. సోనియా దయ, తెలంగాణ ప్రజల పోరాటం వల్ల సాధించుకున్న తెలంగాణను ప్రస్తుత పాలకులు బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్‌ బార్‌అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. నిజామాబాద్‌ ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ బిల్‌ ...

Read More »

మలవత్‌ పూర్ణకు ఘన సన్మానం

నిజామాబాద్‌,. మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లివ్‌ అండ్‌ లెట్‌ లైవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మౌంటనీర్‌ మలవత్‌ పూర్ణను శుక్రవారం లివ్‌ అండ్‌ లెట్‌ లైవ్‌ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మొదటి వార్షికోత్సవ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రంగాలలో ప్రతిష్టాత్మక సేవలందిస్తూ మరికొందరికి ఆదర్శంగా ఈ నెల 24 జరిగిన కార్యక్రమానికి పూర్ణ అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం పూర్ణను సన్మానించినట్లు లివ్‌ అండ్‌ లెట్‌ లైవ్‌ ఛైర్మన్‌ పడకండి రాము తెలిపారు. 24వ తేదీన ఇండోనేషియాలోని ...

Read More »

చలివేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దఫేదార్‌ కిషన్‌ జ్ఞాపకార్ధంగా అంబలి చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ బాలమణి సూచించారు. నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో బస్టాండ్‌ సమీపంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు అంబలి చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఇక్కడ ప్రతియేటా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు. ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప ...

Read More »

గెలిపించండి : అభివద్ధి చేస్తా

నిజాంసాగర్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ చేసిన అభివద్ధి ఏ పార్టీ కూడా చేయలేదని తెరాస ఎంపి అభ్యర్థి బి.బి.పాటిల్‌ అన్నారు. శుక్రవారం ఆందోల్‌ నియోజకవర్గంలోని పుల్కల్‌ గ్రామంలో పాటిల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను తిరిగి గెలిపిస్తే అభివద్ధి ఇంకా బాగా చేసి చూపిస్తానన్నారు. 70 ఏళ్ళలో జరిగిన అభివద్ధి నాలుగు సంవత్సరాలలో కెసిఆర్‌ పాలనలో జరిగిందన్నారు. ఆడపడుచుల కోసం కెసిఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ తదితర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. భారీ ...

Read More »

ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లుు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్‌ దాలియా, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, జగిత్యాల ఎస్‌పి సింధు శర్మలతో కలిసి శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లు, తదితర విషయాలపై సమావేశం ఏర్పాటు చేశారు. హాజరైన పోలీసు అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నామినేషన్ల స్క్రుటినీ పూర్తిచేసి గుర్తులు ...

Read More »

నేడు మహాజన సభ

రెంజల్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం మహాజన సభను చైర్మన్‌ మొహినోద్దీన్‌ అధ్యక్షతన నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మహాజనసభకి డైరెక్టర్లు, రైతులు తప్పకుండా సకాలంలో హాజరవ్వాలని అన్నారు.

Read More »

మహావృక్షంగా కామారెడ్డి కళాశాల మొక్క

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 55 ఏళ్ల క్రితం కామారెడ్డి కళాశాల మొక్క నేడు వటవృక్షంగా మారిందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ చీఫ్‌ సెక్రెటరీ, కామారెడ్డి డిగ్రీ కళాశాలకు అంకురార్పణ చేసిన అప్పటి నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ బి.ఎన్‌.రామన్‌ అన్నారు. కామారెడ్డి ప్రబుత్వ డిగ్రీ కళాశాల 55వ వార్షికోత్సవ సభ శనివారం జరిగింది. దీనికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రామన్‌, ఆయన భార్య లీలారామన్‌లను జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ, కళాశాల యాజమాన్యం సన్మానించింది. ఈ ...

Read More »

వార్షిక రుణ ప్రణాళిక విడుదల

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లీడ్‌బ్యాంకు ద్వారా 2019-20 సంవత్సరం వార్షిక రుణ ప్రణాళికను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ విడుదల చేశారు. 3646 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఇది గత సంవత్సరం కన్నా 16 శాతం ఎక్కువని చెప్పారు. వ్యవసాయ పంట రుణాల కింద 2010 కోట్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వ్యవసాయ రంగానికి 2643 కోట్లు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రాధాన్యతా రంగ రుణాల కింద 3296 కోట్లు నిర్ణయించినట్టు వివరించారు. ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై ప్రజలకు అవగాహన

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం కామారెడ్డి బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్‌ 7వ తేదీ వరకు గ్రామాల్లో వీవీప్యాట్‌, ఈవియం యంత్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఓటు వేసే విధానం, తాము ఎవరికి ఓటువేశామన్న వీవీప్యాట్‌ ద్వారా తెలుసుకోవడం, యంత్రాల వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, తహసీల్దార్‌ ...

Read More »