నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 1 ఎంపి కవిత నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి ఆర్మూరు పెర్కిట్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన రోడ్‌షోలో ఎంపీ కవిత మాట్లాడుతూ 16 కు 16 ఎంపీ సీట్లలో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణ అభివద్ధి చెందిన విధంగానే దేశం మొత్తాన్ని అభివ ద్ధి పరచుకోవచ్చని, ఆశక్తి యుక్తులు మన నాయకుడు కేసీఆర్‌కు ఉన్నాయని వివరించారు. తెరాస జెండాతో చిన్నారి ఉత్సాహం కాంగ్రెస్, బి.జె.పిలు ...
Read More »Daily Archives: April 1, 2019
తెరాసలోకి జాలిగం గోపాల్
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాలిగం గోపాల్, ఆయన భార్య సునీత టిఆర్ఎస్లో చేరారు. గోపాల్ మూడు దశాబ్దాలుగా బిజెపిలో వివిధ పదవుల్లో పనిచేశారు. సునీత నిజామాబాద్ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. వీరితో పాటు బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.రాజుగౌడ్, 11 వ డివిజన్ అధ్యక్షుడు, డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జి.నరేందర్ టిఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపి కవిత గులాబీ కండువ కప్పి టిఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కేంద్ర ...
Read More »వంజరుల మద్దతు ఎంపి కవితకే
రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకురాలు కవితకే వంజరుల పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వంజరి సంఘం జిల్లా అధ్యక్షుడు భూమయ్య అన్నారు. మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో సోమవారం వంజరి సంఘం జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కల్వకుంట్ల కవితకే పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం మాట్లాడుతూ వంజరుల అభివద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కషి చేసిందని వంజరులు ...
Read More »4,5వ డివిజన్ల బూత్‌కమిటీ సమావేశం
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కెసిఆర్ తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో వుంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అన్నారు. సోమవారం 4,5వ డివిజన్ల బూత్‌కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గర్భవతుల కోసం 102 అంబులెన్స్ సేవలు ప్రారంభించి కెసిఆర్ కిట్‌ను అలాగే ఆడబిడ్డ పుడితే 13 వేలు, మగ బిడ్డ పుడితే ...
Read More »రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ మోర్తాడ్
నిజామాబాద్, ఏప్రిల్ 1 ఎంపి కవిత నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో తెరాస లోక్‌సభ అభ్యర్థి ఎంపీ కవిత సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పసుపు బోర్డుపై కేంద్ర మంత్రులకు అనేక వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. పసుపు బోర్డుపై లోక్‌సభలో ప్రైవేటు బిల్లు కూడా ప్రవేశ పెట్టామని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారన్నారు. సభకు హాజరైన మహిళలు దేశంలో ఎక్కడా ...
Read More »పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 1 జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు అన్ని ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో ఏఆర్ఓలు నోడల్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి రెండోదశ శిక్షణ తరగతులను అదేవిధంగా అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని బియుల సంఖ్య పెరుగునున్నందున ఎలక్షన్ ...
Read More »కెసిఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించి బి.బి.పాటిల్
నిజాంసాగర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 3వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం దగ్గర జరగనున్న సిఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టి.ఆర్.ఎస్. అభ్యర్థి బీ.బీ.పాటిల్ పరిశీలించారు. ఎండాకాలం అయినందున తాగునీరు, షామియానాలు, సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ చైర్మన్ దేవి శ్రీప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, ...
Read More »మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు
నిజాంసాగర్, ఏప్రిల్ 1 ఎంపి బి.బి.పాటిల్ నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశీర్వదించండి అభివద్ధి చేసి చూపిస్తానని ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. తిరిగి ఎంపిగా గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కెసిఆర్ పాలనలో గ్రామాల అభివద్ధి జరిగిందని అన్నారు. 70 సంవత్సరాలలో కానీ అభివద్ధి నాలుగున్నర సంవత్సరాలలో జరిగిందన్నారు. ఎంపీ స్థానాలను 16 గెలుచుకుంటే ఢిల్లీలో చక్రం తిప్ప వచ్చన్నారు. కెసిఆర్‌తో గ్రామాల ...
Read More »అరేబియన్ మండి రెస్టారెంట్ ప్రారంభం
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో సోమవారం అరేబియన్ మండి హోటల్‌ను నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి మహానగరాలకు పరిమితమైన ఇటువంటి రెస్టారెంట్లు నిజామాబాద్ లాంటి నగరాలకు రావడం గర్వించదగ్గవిషయమన్నారు. హోటల్ యజమాని మెను వివరిస్తు అరేబియన్ వంటకాలతోపాటు ఇండియన్, చైనీస్ వంటకాలు ఉంటాయని, ముఖ్యంగా అరేబియన్ వంటకాలు ప్రత్యేకమని వివరించారు. సామాన్యులకు అందుబాటులో ధరలుంటాయని వారు పేర్కొన్నారు.
Read More »డయల్ యువర్ సిపికి ఆరు ఫిర్యాదులు
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిపికి ఆరు ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్, ఆర్మూర్, బోదన్ డివిజన్లనుంచి బాదితులు ఫోన్ చేసి తమ సమస్యలు కమీషనర్‌తో విన్నవించుకున్నారు. కమీషనర్ సమస్యలపై స్పందిస్తు వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని, పిర్యాదుల పూర్వాపరాలు పరిశీలించి నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కమీషనరేట్ పరిధిలోని ప్రజలందరు శాంతిభద్రతల సమస్యలతో పాటు ఇతరత్రా సమస్యలుంటే డయల్ యువర్ సిపికి ...
Read More »జనసేన పార్టీలో మహిళల చేరిక
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని నిజామాబాద్ పట్టణంలోని గాయత్రి నగర్‌కి చెందిన మహిళ కార్యకర్తలు సోమవారం జనసేన ఎంపీ అభ్యర్థి బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ యువత, మహిళలు మరియు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తున్నారన్నారని ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళ నాయకులు అరుణ జోతి, నాయకులు శేఖర్ ఖన్నా, చిరంజీవి, నరేష్, ...
Read More »ఎంపిగా బి.బి.పాటిల్‌ను గెలిపించాలి
బాన్సువాడ, ఏప్రిల్ 1 పోచారం భాస్కర్‌రెడ్డి నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంటు తెరాస అభ్యర్థి బి.బి.పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని దేశాయ్‌పేట్ సింగిల్‌విండో అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. సోమవారం బాన్సువాడలోని తెరాస కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 70 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ది చేయలేదని, తెరాస ఐదేళ్లలో ప్రగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో వందకోట్లతో అభివృద్ది పనులు జరిగాయని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ...
Read More »ఒక్కో కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లు
నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 1 రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో ఒక్కో కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానిస్తామని, ఈసీ బందం సోమవారం హైదరాబాద్ వస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. అన్ని అంశాలపైనా పూర్తిస్థాయిలో చర్చిస్తామని, నిజామాబాద్, జగిత్యాల కలెక్టర్లు కూడా సమావేశానికి వస్తున్నారన్నారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ కోసం అవసరమైన భవనాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు తదితరాలపై చర్చిస్తామన్నారు. నిజామాబాద్‌లో ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నందున ...
Read More »చలివేంద్రం ప్రారంభించిన డిఎస్పి
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వాసవీ క్లబ్ కామారెడ్డి, వాసవీ వనిత క్లబ్ కామారెడ్డి ఆద్వర్యంలో పాత బస్టాండ్ సమీపాన గల అనిల్ ఫోటోస్టూడియో వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సోమవారం కామారెడ్డి డిఎస్పి లక్ష్మినారాయణ ప్రారంభించారు. చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయాలని తద్వారా ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆసుపత్రుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి వచ్చే రోగులకు, చుట్టుపక్కల వారికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, హారిక, అనిల్, కృష్ణ, భవాని, సాత్విక, ...
Read More »పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కంకిటి మండలం బాబుల్‌గాం గ్రామంలో పోలింగ్ కేంద్రం 98ని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో జరగనున్న పోలింగ్ నిర్వహణ నేపథ్యంలో ఆయన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామంలో 762 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ బావయ్యలకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మద్నూర్ మండల కేంద్రంలోని ఈవిఎం, వీవీప్యాట్ యంత్రాలు ...
Read More »బి.బి.పాటిల్‌కు టిఎంఆర్పిఎస్ మద్దతు
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెరాస జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి బి.బి.పాటిల్‌కు టిఎంఆర్పిఎస్ తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు పార్టీ జిల్లా కోశాధికారి యాదవరావు తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జహీరాబాద్ ఎంఆర్పిఎస్ ఇన్చార్జి శ్రీనివాస్, జాతీయ ఇన్చార్జి వేముల బలరాం ఆదేశాలతో పాటిల్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన పక్షాన ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. దళితుల కోసం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మాదిగల అభ్యున్నతి ఆయన ద్వారానే జరుగుతుందన్నారు. టిఎంఆర్పిఎస్ అందుకే తెరాస ...
Read More »హామీలు నెరవేర్చలేకే హిందువులపై దూషణ
కామారెడ్డి, ఏప్రిల్ 1 కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తామిచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంతో చేసిన పనిని చెప్పి ఓట్లు అడగలేక మతాల ప్రాతిపదికన విభజించి దూషిస్తు కెసిఆర్ ఓట్లు పొందాలని చూస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మోదిపై బిజెపిపై ప్రజలు చూపుతున్న ఆదరణ తెలంగాణలో సైతం ఉంటుందన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక కెసిఆర్ ...
Read More »బీడీ కార్మికులకు మూడు వేల జీవనభృతి కల్పించాలి
రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ప్రతి నెల రూ.3000 జీవనభతి కల్పించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కష్ణ అన్నారు. సోమవారం తహసీల్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని బీడీ కార్మికులకు చేతినిండా పని కల్పించి నెలలో ఇరవై ఆరు రోజులు పని దినాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ...
Read More »బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక సందర్భంగా సోమవారం నూతన కార్యవర్గం జిల్లా కోర్టులో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి కే.సుజన హాజరయ్యారు. అతిధులు బార్ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, శ్యాంసుందర్‌లు హాజరయ్యారు. బార్ అసోసియేషన్లు ఎన్నికల్లో స్థానం దక్కించుకున్న అధ్యక్ష కార్యవర్గ సభ్యులు జే వెంకటేష్, వెంకట రమణ గౌడ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆకుల రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఉపాధ్యక్షులు రామకష్ణ, మహిళ ...
Read More »కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించాలి
రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిడి రమేష్ అన్నారు. సోమవారం మండలంలోని నీల గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ప్రభుత్వం రైతుల కొరకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏపీఎం చిన్నయ్య, సిసి రాజయ్య, టిఆర్ఎస్ నాయకులు రాఘవేందర్, ...
Read More »