Daily Archives: April 3, 2019

బీజేపీ, కాంగ్రెస్‌ పరిపాలనలో విఫలమయ్యాయి

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 3 మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలనలో విఫలమయ్యాయని, మరో ప్రత్యామ్నాయ పరిపాలన దేశానికి ఇప్పుడు కావాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఈ మేరకు ఓ టివి చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ కావాలని, బీజేపీ సర్కారుకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని సిఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర ...

Read More »

బిజెపికి లొల్లి ఎక్కువ పని తక్కువ

కోరుట్ల, ఏప్రిల్‌ 3 ఐలాపూర్‌లో ఎంపి కవిత నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపికి లొల్లి ఎక్కువ ..పని తక్కువ.. కార్యకర్తలు ఉండరు.. ఓటు వేసే వాళ్ళు ఉండరు అని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం కోరుట్ల మండలం ఐలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ కవితకు మహిళలు బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన బిజెపి అన్ని మరచి పోయిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి అసత్యాలను ...

Read More »

టిఆర్‌ఎస్‌తోనే ఎంబీసీల అభ్యున్నతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 ఎంబీసీల సంఘము జాతీయ అధ్యక్షులు కాలప్ప నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోని ఎంబీసీల అభ్యున్నతి కేవలం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఎంబీసీల సంఘం జాతీయ అధ్యక్షులు కె.సి.కాలప్ప పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంబీసీల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు ...

Read More »

ఎంపి కవితకు సంపూర్ణ మద్దతు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు తెరాస అభ్యర్థి ఎంపి కవితకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు అన్నయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కవిత చొరవతో రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులకు అనేక సౌకర్యాలు, పథకాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. గంగపుత్రులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు చేపపిల్లల పెంపకం, వాహనాల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు గంగపుత్రులు సమాజంలో ...

Read More »

ఎంపి కవితను గెలిపించుకుంటాం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నిజామాబాద్‌ పట్టణ కల్లుగీత 3వ సంఘం గౌరవ అద్యక్షుడు స్వామిగౌడ్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు సొసైటీలకు, టిఎఫ్‌టిలకు ప్రభుత్వం భారీగా లైసెన్సు ఫీజు విధించేదని, తెరాస అధికారంలోకి వచ్చాక లైసెన్సు ఫీజు పూర్తిగా రద్దుచేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా గౌడ కులవృత్తిని ఆదుకునే ఉద్దేశంతో కల్లు గీత కార్మికులకు పెన్షన్‌ ...

Read More »

కారు గుర్తుకే ఓటేయాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కవితమ్మను గెలిపించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. కవితమ్మ చేసిన అభివద్ధి పనుల గురించి వారికి వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి కవితను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు.

Read More »

వేసవి దృష్ట్యా అధికారులు చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి దృష్ట్యా ప్రజలు ఇబ్బందుల పాలుకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. పలుశాఖలకు సంబంధించి కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. ఉపాధి కూలీలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, షెల్టర్‌, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉంచాలన్నారు. పాలిచ్చే తల్లులను కూలీపనికి అనుమతించవద్దని సూచించారు. ఎండ తీవ్రత వల్ల కలిగే అనర్థాలను ముందస్తు తీసుకునే జాగ్రత్తలను సంబంధించి ఫ్లెక్సీ, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ...

Read More »

అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ అమలు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రబుత్వం ఇచ్చిన ఆదేశాలు తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణలో అగ్రవర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అగ్రవర్ణ పేదల సంఘం జాతీయ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, తెలంగాణ రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఓపక్క కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్‌ కల్పిస్తు దాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తుండగా తెలంగాణలో మాత్రం కెసిఆర్‌ సర్కారు రిజర్వేషన్‌లను తొక్కిపెడుతుందని ఆరోపించారు. ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాలు ...

Read More »

సిఎం కెసిఆర్‌ సభకు తరలిన తెరాస శ్రేణులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఆందోల్‌లో బుధవారం జరిగిన కెసిఆర్‌ బహిరంగసభకు కామారెడ్డి జిల్లా నుంచి తెరాస శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సభను విజయవంతం చేసేబాధ్యతను జిల్లా నాయకులపై ఉంచగా జిల్లా నాయకులు నలుమూలల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. వారిని బస్సుల్లో సభకు తరలించారు. సభను జయప్రదం చేయాలని ఇచ్చిన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నాయకులు సమకూర్చారు.

Read More »

పార్లమెంటులో గళమెత్తని పార్టీలను గెలిపించడమెందుకు

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 కాటిపల్లి రమణారెడ్డి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెరాస ఎంపి బి.బి.పాటిల్‌ను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఒక్కసారి గళమెత్తని అదే పాటిల్‌ను మళ్లీ ఎందుకు గెలిపించాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామరెడ్డి నియోజకవర్గం బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో బుధవారం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోడి గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది తిరిగి ఆయనను ప్రధానిని ...

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఈనెల 11న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 05 జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 265 పోలింగ్‌ స్టేషన్‌ కంట్రోల్‌ యూనిట్స్‌, బ్యాలెట్‌ యూనిట్స్‌, వివిప్యాట్‌లను సిద్దం చేసి కమీషనింగ్‌ కార్యక్రమం జరిపారు. అనంతరం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ప్రారంభించి కమీషనింగ్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో ...

Read More »

ఈ ఎన్నిక ఒక చరిత్ర కానున్నది

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 కేంద్ర ఎన్నికల అధికారి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం ఎన్నిక ఒక చరిత్రకు నాంది కానున్నదని కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ తెలిపారు. బుధవారం ఆయన ఇతర కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి హెలికాప్టర్‌ ద్వారా నిజామాబాద్‌లో పర్యటించారు. ఈవీఎంల చెకింగ్‌ నిర్వహిస్తున్న శ్రీ విజయలక్ష్మి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్‌ ఇతర అధికారులతో కలిసి కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్‌ ...

Read More »

కాంగ్రెస్‌ పార్టీ పేదల పక్షపాతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 మధుయాష్కీ గౌడ్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ పేదల పక్షపాతి అని అన్నారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌, ఎడపల్లి మండల కేంద్రాల్లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు అందరు కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటే పేదలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్ని వస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో ...

Read More »

బీజేపీ అభ్యర్ధి అర్వింద్‌ ధర్మపురికే తమ మద్దతు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్ధి అర్వింద్‌ ధర్మపురికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు మున్నూరుకాపు యువత, ఎండీఎఫ్‌ నాయకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా మున్నూరు కాపు అభ్యర్ధులకు ప్రచారం చేస్తున్నామని, కాపు జాతి మొత్తం ఇంటింటి ప్రచారం చేసి అర్వింద్‌ గారిని గెలిపించాలని విజప్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే మా అన్ని కమిటీలు ...

Read More »

ముగిసిన పది పరీక్షలు

రెంజల్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతియేటా మాదిరిగానే ఈ ఏటా మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి పది పరీక్షలు నిర్వహించగా ఇటివలే ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ మార్చ్‌ 22 న ఖరారు అవ్వడంతో ఆ రోజు నిర్వహించవలసిన ఇంగ్లీష్‌ పేపర్‌ను ఈ నెల 3వ తేదీన బుధవారం నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి గణేష్‌ రావ్‌ వివరించారు. రెంజల్‌ మండలంలోని మొత్తం 477 మంది విద్యార్థులకు గాను 477 మంది ...

Read More »

కందకుర్తి చెక్‌ పోస్ట్‌ను పరిశీలించిన ఎన్నికల అధికారి

రెంజల్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఉత్కంఠ భరితంగా నెలకొన్న ఎన్నికల పరిస్థితిని దష్టిలో ఉంచుకొని జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గల చెక్‌ పోస్టులలో భాగంగా మండలంలోని కందకుర్తి వద్ద చెక్‌పోస్ట్‌ ను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కిరణ్‌ పరిశీలించారు. అక్రమ మద్యం, నగదును చెక్‌ పోస్టుగుండా అక్రమ రవాణా జరుగకుండా దష్టి పెట్టాలని చెక్‌ పోస్ట్‌ అధికారులకు ఆదేశించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అవకతవకలు జరిగినట్లు తేలితే ఎట్టివారినైన సహించేది లేదన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ ...

Read More »

న్యాయవాదులకు తోడుగా నిలుస్తా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 అర్వింద్‌ దర్మపురి నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత పార్లమెంటులో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతానని అన్ని వేళలా తోడు నీడగా నిలుస్తానని నిజామాబాద్‌ బిజెపి లోక్‌సభ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. న్యాయవాదవృత్తికి గొడ్డలిపెట్టులా నిలిచిన క్రిమినల్‌ ప్రొసిసర్‌ కోడ్‌ 41 ఎ సెక్షన్‌ను రద్దుచేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయసేవలందిస్తు న్యాయవాదులకు ఇళ్ల స్థలాల ...

Read More »