Breaking News

10,11 హాలిడేస్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభల పోలింగ్‌ సందర్భంగా ఏప్రిల్‌ 10,11న రెండ్రోజులపాటు స్థానికంగా సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పబ్లిక్‌ బిల్డింగ్స్‌, విద్యాసంస్థలు, ఇతర బిల్టింగ్‌లను పోలింగ్‌ స్టేషన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లుగా వినియోగిస్తున్నందున జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లోకల్‌ హాలిడే ప్రకటించామన్నారు.

అన్ని ప్రబుత్వ కార్యాలయాలు, లేబర్‌, ఎప్లైమెంట్‌ ట్రెని, మునిసిపల్‌ కౌన్సిల్స్‌, లోకల్‌ బాడిస్‌ లోకల్‌ హాలిడేగా ప్రకటించబడ్డాయన్నారు. జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీలు ఏప్రిల్‌ 10,11న యధావిధిగా పనిచేస్తాయన్నారు.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article