కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపణ
నిజామాబాద్, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సామాన్య పేద ప్రజలు ఆర్థికంగా ఎదగలేకపోయారని అధికారంలోకి రాకముందు పేద ప్రజల బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో రూ 15 లక్షలు వేస్తారని మోడీ హామీ ఇచ్చారని ఇప్పటివరకు ఒక్కరి ఖాతాలో కూడా ఒక రూపాయి రాలేదని ఆమె అన్నారు. మోడీ పాలనలో ప్రజలకు అనేక షాక్‌లు తగిలాయని, మోడీ మూడు భారీ షాక్‌లు దేశ ప్రజలకు ఇచ్చారని, నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల సామాన్య, పేద తరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారని చేతిలో నగదు లేక ఏటీఎంల చుట్టూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు.
దాని తర్వాత ప్రజల నెత్తిన మరో బండ వేశారని జి.ఎస్.టిని తీసుకువచ్చి చిన్న వ్యాపారాలకు జిఎస్టి శాపంగా మారి ఎంతో మంది ప్రజలు చిన్న వ్యాపార చేయలేకపోతున్నారని జిఎస్టి కేవలం కార్పొరేట్ వ్యాపార సంస్థలకు అనుకూలంగా ఉందని ఆమె ఆరోపించారు. ఆనాడు నోట్ల రద్దును సమర్ధించిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల సమయం చూసుకొని మోడీపై విమర్శలు చేస్తున్నారని మోడీ కేసీఆర్‌లు ఇద్దరు తోడు దొంగలే అని ఆమె అన్నారు. 16 ఎంపీలు గెలుస్తామన్న కేసిఆర్ 16 గెలిస్తే మళ్లీ మోడీతో కలుస్తారని, దొరల పాలనలో నలిగి పోతున్నామని ఇప్పటికైనా కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పేదల పక్షపాతి అని పేదల కోసం రాహుల్ గాంధీ అద్భుతమైన పథకాన్ని రూపొందించారని అధికారంలోకి రాగానే కనీస ఆదాయ భరోసా పథకం ద్వారా పేదలకు ప్రతి సంవత్సరం రూపాయలు దెబ్బయ్ రెండూ వేలు అకౌంట్లో వేస్తామని, నెలకు ఆరువేలు వస్తాయని ఇక పేదలు ఆనందంగా వుండే రోజులు దెగ్గరలో ఉన్నాయని విజయశాంతి పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి మధు యాష్కి గౌడ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బహిరంగ సభలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మనలా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేశవేణు, మహేష్ కుమార్ గౌడ్, గడుగు గంగాధర్, తహెర్ బిన్ హుందాన్, స్వామిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021