రాష్ట్రంలో 10% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో ఉన్న అగ్రవర్ణ పేదలను దష్టిలో ఉంచుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల బిజెపి ప్రభుత్వానికి తాము కతజ్ఞులమని రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలను దష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది శాతం రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధం ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తాము రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో, పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నామని, అగ్రవర్ణ సోదరులలో తాము పార్లమెంట్ ఎన్నికలపై చైతన్యం తీసుకువస్తున్నామని తెలిపారు. అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్డిలలో అధిక శాతం పేద వారు ఉన్నారని వారికి చట్టబద్ధంగా కల్పించిన 10 శాతం ఈబిసి రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం కల్పించిన రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలంటే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలతోనే పరిష్కారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, అజయ్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021