Breaking News
ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహిస్తున్న సర్పంచ్‌ వికార్‌ పాషా

ఎంపి కవిత గెలుపుకోసం ప్రచారం

రెంజల్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యర్థి ఎంపి కవిత గెలుపుకోసం గురువారం సాటాపూర్‌ సర్పంచ్‌ వికార్‌ పాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కల్వకుంట్ల కవితను గెలిపించాలని కోరారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్న కూలీల వద్దకెళ్ళి ప్రచారం చేపట్టారు. ఉపాధి హామీ కూలీలందరు తెలంగాణ బతుకమ్మ, ఇంటి ఆడపడుచు కవితను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌, ముంతాజ్‌ బేగ్‌, హాజిఖాన్‌, గంగాధర్‌, లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Check Also

ఇళ్ళు దెబ్బతిన్న వారికి తక్షణ సహాయం అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా దెబ్బతిన్న ...

Comment on the article