కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
కామారెడ్డి, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు సమగ్రసర్వే మే 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వ్యవసాయధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాదికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రైతు సమగ్ర సర్వే కార్యక్రమాన్ని సమీక్షించారు. మండలాల వారిగా ఇప్పటి దాకా సాధించిన ఫలితాలను సమీక్షించారు.

జిల్లాలో మొత్తం 2 లక్ష 34 వేల 85 రైతులకు సంబంధించి గత నెల 28 తేదీ నుంచి ఇప్పటి వరకు 19 వేల 222 రైతులకు సంబంధించిన సర్వే పూర్తయిందన్నారు. మిగతా లక్ష్యాన్ని మే 15 లోగా పూర్తిచేయాలన్నారు. ఒక్కో అధికారి ప్రతిరోజు 50 నుంచి 55 రైతుల వివరాలు సేకరించి అప్లోడ్ చేయాల్సి వుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, ఏవోలు మహేశ్వరి, రత్నం, నర్సింహులు, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021