నిజామాబాద్, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించిన అధునాతన ఎం3 ఓటింగ్ యంత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. బెంగళూరు బెల్ కంపెనీ నుండి వచ్చిన ఓటింగ్ యంత్రాలను ముందుగా నిజామాబాద్ అర్బన్ రూరల్ బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ యంత్రాలను మొదటిదశ చెకింగ్ పక్రియ పూర్తిచేశారు. ఈ పక్రియ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఇంజనీర్లు ఈసీ స్పెషల్ అధికారులు సమక్షంలో ఓటింగ్ యంత్రాల పరిశీలన జరుగుతున్నది. నియోజవర్గ వారీగా అవసరమైన టేబుల్ ఏర్పాటు చేసి యంత్రాల పరిశీలన జరుగుతున్నది. ఈ పక్రియను జిల్లాకు వచ్చిన ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్ దాలియా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు అక్కడికి వచ్చిన వారికి ఈ ప్రక్రియ గురించి అక్కడికక్కడే జిల్లా కలెక్టర్ వారికి వివరిస్తున్నారు. బ్యాలెట్ యూనిట్లకు బ్యాలెట్లు అమర్చుతు మాక్ పోలింగ్ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో జిల్లాలో 5 అసెంబ్లీ నియోజవర్గాలు జగిత్యాల జిల్లాలో కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజక వర్గం సంబంధించిన యంత్రాల పరిశీలన జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన పక్రీయా జరుగుతున్నది. జిల్లాలోని నిజామాబాద్ అర్బన్ రూరల్ బాల్కొండ నియోజకవర్గాల సంబంధించిన ఓటింగ్ యంత్రాల పూర్తిప్రక్రియ శుక్రవారంలోగా పూర్తయ్యే అవకాశముంది.
ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో సంబంధించిన యంత్రాలు పరిశీలన రెండు రోజులలో పూర్తయ్యే అవకాశముంది. పరిశీలన ప్రక్రియ కోసం నియమింపబడ్డ సిబ్బంది అధికారులు ఇంజనీర్లు 24 గంటలపాటు పని చేస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేసే విధంగా కషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. జిల్లా కలెక్టర్‌తో పాటుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021