Breaking News
విద్యార్థిని అభినందిస్తున్న పాఠశాల కరస్పాండెంట్‌, సిబ్బంది

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామ కాంతి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి బానవత్‌ ప్రశాంత్‌ అండర్‌-12 జాతీయస్థాయి సాప్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారని కరస్పాండెంట్‌ కాంతి గంగారెడ్డి తెలిపారు. గతనెల నిజామాబాద్‌ జిల్లా ధర్మారంలో జరిగిన రాష్ట్రస్తాయి పోటీలకు సాప్ట్‌బాల్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, జనరల్‌సెక్రెటరీ గంగామోహన్‌ పాల్గొన్నారు.

పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రశాంత్‌ని వారు జాతీయస్థాయి సాప్ట్‌బాల్‌పోటీలకు ఎంపికచేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 7,8 తేదీల్లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలాన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం పాఠశాల ఆవరణలో ప్రశాంత్‌ను డైరెక్టర్‌ హిమారాణి, అడ్మినిస్ట్రేటివ్‌ ఇన్‌చార్జి ప్రవీణ్‌రెడ్డి, అకడమిక్‌ ఇన్‌చార్జి మల్లేశ్‌, నిఖితరెడ్డి, అన్వేష్‌, మహేశ్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Check Also

బిసిల‌ అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ ...

Comment on the article