జక్రాన్‌పల్లి రోడ్‌షోలో ఎంపి కవిత
నిజామాబాద్, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ ఆధారమూ లేని పేదలకు బ్యాంకులకు సిఎం కెసిఆర్ జమానత్ ఉండి రూ. 50 వేలు వరకు రుణాలను ఇప్పించారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల తెలిపారు. గురువారం నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని జక్రాన్‌పల్లిలో జరిగిన రోడ్‌షోలో ఆమె ప్రసంగించారు. కులాలు, మతాలకు అతీతంగా సిఎం కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. పేదలు తీసుకున్న రుణాలను బ్యాంకుకు ప్రభుత్వమే చెల్లిస్తుందని కవిత వివరించారు. శక్తివంచన లేకుండా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా 24 గంటలూ ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు.
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, 13 రాష్ట్రాల్లో బీడి కార్మికులున్నారు కాని బీడి కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది మాత్రమేనని, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని, ఆర్థిక స్థోమత కలిగిన ఇంటి ఆడపిల్లలు గర్భవతి అయితే కాలు కింద పెట్టకుండా చూసుకుంటారని, కాని పేదింటి ఆడపిల్ల గర్భవతి అయితే పనికి పోకుండా నడవని పరిస్థితి ఉండేదన్నారు. కైకిలి పోయివచ్చిన గర్భిణి రాత్రి ప్రసవం అయిన విషయాన్ని తానూ చూశానని తెలిపారు. ఈ ఇబ్బంది ఉండోద్దనే కెసిఆర్ కిట్‌ను సిఎం కేసిఆర్ తీసుకువచ్చారని కవిత తెలిపారు.
వెయ్యి రూపాయల పెన్షన్ వస్తున్న వారందరికీ మే 1 నుంచి రెండు వేల 116 రూపాయలు వస్తుందన్నారు. మొన్న ఎన్నికల్లో చెప్పినట్లు 57 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్ వస్తుందన్నారు. పిఎఫ్ కార్డులు ఉన్న వారందరికీ పెన్షన్ ఇస్తారని తెలిపారు. కెసిఆర్ బోలా శంకరుడన్నారు. జక్రాన్‌పల్లిలో 13 వేల మందికి పెన్షన్ ఇస్తున్నామని, ఇందులో సగం మంది మహిళలే కావడం తనకు సంతోషాన్ని ఇస్తున్నదని కవిత తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతోన్న విషయం మీకు తెలుసునన్నారు. సొంత జాగాలు ఉన్న పేదలకు వారి అకౌంట్లలో రూ.5 లక్షలు వేస్తారని, ఎన్నికలయ్యాక అధికారులు మీ ఇంటికి వస్తారన్నారు. జాగాలు లేని వారికి డబుల్ బెడ్ రూం పథకంలో ఇళ్లు వస్తాయని తెలిపారు.

రెండేళ్లలో ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టి …ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. మళ్లీ ఓట్లు అడిగే నాటికి పేదలకు ఇళ్లు రాలేదని అడిగే పరిస్థితి ఉండవద్దనే లక్ష్యంతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలసి పనిచేస్తున్నట్లు కవిత తెలిపారు. డ్వాక్రా మహిళల చేత పంట ఉత్పత్తులను కొనుగోలు చేయిస్తామని, దీనివల్ల కమిషన్ వస్తుందన్నారు. తిరిగి ఆ వస్తువులను విక్రయించడం వల్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. కల్తీలేని వస్తువులను తయారు చేసి విక్రయించడం వల్ల ప్రజలకు ఆరోగ్యం లభిస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపడతామన్నారు.

జక్రాన్‌పల్లి ఎర్ పోర్టు కోసం 800 ఎకరాలు సేకరించి ఉంది..రానున్న రోజుల్లో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు అవుతుంది. ఈ ప్రాంతం అభివద్ధి చెందుతుందని కవిత చెప్పారు. ఇప్పటికే రైలు వచ్చేసింది…విమానాలూ వస్తే రాక పోకలతో పాటు వాణిజ్యం అవసరాలూ తీరుతాయని చెప్పారు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైను ఇరవై ఏళ్లుగా నిద్ర పోయింది. నన్ను గెలిపిస్తే రైలును రప్పిస్తానని గత ఎన్నికల్లో హామీనిచ్చాను. మూడేళ్లలో కేంద్రంపై వెంట పడి రైలును తెప్పించానని చెప్పారు. తిరుపతి, ముంబయ్ పోవడానికి రైలు కావాలంటే వేయించానని చెప్పారు.
చదువుకున్న వారికి ఉద్యోగాల కోసం నిజామాబాద్‌లో ఐటి హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ చదవుకున్న వారు, కంప్యూటర్ నాలెడ్జి ఉన్న వారికి నిజామాబాద్‌లోనే ఉద్యోగాలు వస్తాయన్నారు. 60 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయని కవిత వివరించారు. రైతు బందు పథకం కింద ఎకరాకు రూ. 5వేలు చొప్పున ఈ ఖరీఫ్ నుంచి ఇస్తామన్నారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి పాస్ బుక్‌లు రాలేదన్నారు. వారికి నెలన్నరలోపు పాస్‌బుక్‌లు ఇప్పిస్తామని సిఎం చెప్పారని తెలిపారు. పాస్‌బుక్ వస్తే రైతుబందు వస్తుందన్నారు. ఏ ఆధారమూ లేని వారికి బ్యాంకు రుణాలను వంద శాతం సబ్సిడీపై ప్రభుత్వం రూ.50 ఇప్పిస్తోందని తెలిపారు.
మన ఇంటి పార్టీ టిఆర్ ఎస్ గుర్తు కారు గుర్తు మొదటి ఈవిఎంలో రెండవదిగా ఉంటుందన్నారు. శక్తి వంచన లేకుండా ఐదేళ్లూ పనిచేసిన విషయం మీకందరికీ తెలుసున్నారు. తాను బాగా పనిచేశానని భావిస్తే కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఎంపి కవిత ప్రజలను కోరారు. నిజామాబాద్ ఎంపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన అర్గుల్‌కు చెందిన బొర్రన్న ఎంపి కవితను జక్రాన్ పల్లిలో కలిసి మద్ధతు తెలిపారు.
కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆనంద్ రెడ్డి, ఎలంబి రాజేశ్వర్, బాజిరెడ్డి జగన్, ఎంపిపి రాజన్న, జడ్పీటిసి తనూజ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బోజన్న, సర్పంచ్ చంద్రకళ, రైతు సంఘం అధ్యక్షులు ఎల్లారెడ్డితో పాటు పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021