Breaking News

జగిత్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో అర్వింద్‌ రోడ్డుషో

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్‌ మండలంలో వివిధ గ్రామాలలో గురువారం జరిగిన రోడ్‌షోలో నిజామాబాద్‌ బిజెపి ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి పాల్గొన్నారు. యువత, రైతులు, మహిళలు అఖండ హారతి ఇస్తూ బీజేపీ అభ్యర్ధి అర్వింద్‌కు మద్దతు పలికారు. వెళ్లిన ప్రతీ గ్రామంలోనూ జననీరాజనాలు అందుకున్నారు అర్వింద్‌. రాయికల్‌ మండలంలోని పైడిమడుగు నుండి ప్రారంభమైన రోడ్‌షో ఇటిక్యాల్‌, మూటపల్లి, కొత్తపేట, వడ్డే లింగాపూర్‌, భూపతిపూర్‌, రామోజీపురం, రాయికల్‌, ఆలూరు, అల్లీపూర్‌, మోరపల్లి, చెల్‌గల్‌ గ్రామాల మీదుగా రోడ్‌షో సాగింది.

ప్రతీ గ్రామంలోనూ మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఖచ్చితంగా గెలిపించుకుంటామంటూ ఆశీర్వదించారు. పసుపు పంట వేసి ధర లేక అమ్మకున్న ధీన స్థితిని , చక్కెర ఫ్యాక్టరీ మూత పడటంతో చెరుకు పంట వేయలేకపోయామంటూ వారి గోడును వెల్లబోసుకున్నారు. అనేక మంది మహిళలు తమకు పక్కా ఇళ్లు లేక ఇంకా గుడిసెలలో జీవనం వెల్లదీస్తున్నామంటూ చెప్పుకున్నారు. వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారమని ఐదేళ్లుగా మిమ్మల్ని నిర్ణక్ష్యం చేసిన వారిని ఓడించి ప్రధాని మోడీకి మద్దతుగా కమలం గుర్తుకు వోటేస్తే వెంటనే పార్లమెంట్‌ కింద లక్ష ఇండ్లు, పసుపుబోర్డు, చక్కెర ఫ్యాక్టరీని కూడా సాధిస్తామని అర్వింద్‌ ధర్మపురి హామీ ఇచ్చారు.

ప్రతీచోట ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చాలా మంది మహిళలు అర్వింద్‌ దష్టికి తీసుకువచ్చారు. దీంతో పేదింటి ఆడతల్లుల సొంతింటి కల నెరవేరాలన్నా, రైతుల గోస ఆగాలన్నా కూడా అది మోడీకే సాధ్యమని, మోడీ ప్రధాని కావడం ఖాయమని, మన దగ్గరి నుండి బీజేపీ ఎంపీ ఉంటే మోడీ దగ్గర మన గౌరవం పెరిగి మరింత అభివ ద్దిని సాదించుకోగలమని అర్వింద్‌ అన్నారు. రోడ్‌షోలో బీజేపీ నాయకులు మోరపల్లి సత్యనారాయణ, రవీందర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, మదన్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article