ఎంపి కవిత
నిజామాబాద్, ఏప్రిల్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసిలకు ఆత్మగౌరవం కల్పించింది టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. గురువారం రాత్రి నిజామాబాద్ లోని బందావన్ గార్డెన్లో బిసి ఐక్యకులాల ఆత్మీయ సమ్మేళం కార్యక్రమం జరిగింది. ఎంపి కవిత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి, త్రివేణి, గౌడ, ముదిరాజ్, యాదవ, వంజరి, రజక, మహేంద్ర, క్షత్రియ సమాజ్, పూసల, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, వడ్రంగి, వడ్డెర సంఘం, రాజ్పుత్ సంఘం, ఆర్యవైశ్య సంఘం, రెడ్డిక సంఘం, గంగపుత్ర సంఘం, వాల్మీకి బోయ సంఘం, మేరు సంఘం, శాలివాహన సంఘం, పెరిక సంఘం, పట్కారి సమాజ్, పూసల సంఘం, గోస్గి సంఘం, బిసి యువజన సంఘం, మొండివారల సంఘాల నాయకులు సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ బిసిల అభ్యున్నతి కోసం చాలా చేస్తున్నామని చెప్పే జాతీయ పార్టీలు నిజానికి వారి కోసం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో 112 బిసి కులాలు బిసిల జాబితాలో ఉన్నాయని తెలిపారు. బిసిలంతా ఒక్క వేదికపైకి వచ్చి తనకు మద్ధతు తెలిపిందనందుకు ఎంపి కవిత సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ..ఒకవైపు రెండు జాతీయ పార్టీలు మరో వైపున్నాయి. ఏ పార్టీ, ప్రభుత్వం బిసిలకు మేలు చేస్తున్నాయో తెలుసుకోవలసిన అవసరముందన్నారు.
తెలంగాణలో బిసిలకు ఈ ఏడాది 6 వేల కోట్లు బిసిల సంక్షేమానికి బడ్జెట్లో పెట్టుకున్నామని కవిత తెలిపారు. అయితే 19 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ పెడితే దీంట్లో రెండు వేల కోట్లు మాత్రమే బిసిలకు బడ్జెట్ కేటాయించారు. ఇది బిజెపికి బిసిలపై ఉన్న ప్రేమ అని కవిత అన్నారు. ఆ రెండు వేల కోట్లు కూడా బడ్జెట్ కేటాయించని కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించుకోవాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2014-15 లో 3వేల కోట్లు, 2015-16లో 3వేల కోట్లు, 2016-17లో 4200 కోట్లు, 2017-18లో 6200 కోట్లు బడ్జెట్ పెట్టుకుని ఖర్చు కూడా చేసిందని కవిత చెప్పారు. అలాగే 20018-19లో 6 వేల కోట్లు బడ్జెట్ కేటాయించుకున్నామని తెలిపారు.
ఏ ఆధారం లేని బిసిలకు రూ. 50 వేలను నూరు శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తూ బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోందని చెప్పారు. ఈ మొత్తాన్ని పెంచబోతున్నట్లు కవిత తెలిపారు. ఎంబిసి కార్పోరేషన్ ద్వార ఎంబిసిలకు రూ. 1000 కోట్లు కేటాయించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వందేనన్నారు. 124 బిసిల కోసం జ్యోతిబా పూలే స్కూళ్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ను అందిస్తుండటంతో డిమాండ్ పెరిగిందని, దీంతో ప్రతి నియోజక వర్గానికి ఒకటి చొప్పున నూతనంగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని కవిత వివరించారు. ఐదేళ్లలో తెలంగాణలో 243 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కాని 70 ఏళ్లలో కాంగ్రెస్, టిడిపిలు కేవలం 19 గురుకుల పాఠశాలలను మాత్రమే ఏర్పాటు చేశాయని విమర్శించారు.
బిసిలపై ప్రేమ ఒలక బొసే పార్టీలపై ఈ వివరాలతో నిలదీయాలని కవిత కోరారు. ఆత్మగౌరవంతో కూడిన అభివ ద్ధి జరగాలని టిఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని ఎంపి కవిత తెలిపారు. బిసిల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ నడిబొడ్డున 1-5 ఎకరాల స్థలం, 1-5 కోట్లు కేటాయించి బిసిల ఆత్మగౌరవ భవన్లకు సిఎం కేటాయించిన విషయం మీకు తెలుసునన్నారు. నిజామాబాద్లో 3-4 ఎకరాల్లో బిసి భవన్ నిర్మాణం చేసుకుందామని, బిసి ఐక్యవేదిక సమ్మతిస్తే పనులు మొదలు పెట్టుకుందామని ఎంపి కవిత కోరారు.
స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లయినా కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ లేక పోవడం శోచనీయం అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బిసి మంత్రిత్వ శాఖ ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడికి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వంలో బిసి మంత్రిత్వ శాఖ పెట్టమని ఐదేళ్లుగా పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. సిఎం కేసిఆర్ మన అసెంబ్లీలోఈ విషయమై తీర్మాణం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందేనన్నారు. అయితే ఈ మధ్యనే కేంద్రం మత్స శాఖను పెట్టిందని కవిత చెప్పారు. ఈ ఎన్నికల్లో బిసిలకు ఏం చేశారో జాతీయ పార్టీలను ప్రశ్నించాలని ఎంపి కవిత పిలుపునిచ్చారు.
అన్ని వర్గాలకు ఆత్మ బంధువు అయిన టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి 16 మంది టిఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 12 ఈవిఎం మెషీన్లు ఉంటాయని, మొదటి ఈవిఎంలో తన పేరు, కారు గుర్తు రెండవదిగా ఉంటుందని కవిత వివరించారు. బిసిల ఐక్య వేదిక సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వి.జి గౌడ్, ఆకుల లలిత, మేయర్ ఆకుల సుజాత, బిసి సంఘాల నేతలు రాజారాం యాదవ్, ఆంజనేయులు, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021