Breaking News
కాంగ్రెస్‌ కరపత్రాలు విడుదల చేస్తున్న ప్రతినిదులు

మధుగౌడ్‌ను ఎంపిగా గెలిపించండి

గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐల ఎన్నికల ప్రచారం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో మధుగౌడ్‌ వైపే గల్ఫ్‌ ఎన్నారై కుటుంబాలు నిలవాలని గురువారం బహ్రెయిన్‌లో ఎన్నారైలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2014లో తెరాస ప్రవాస సంక్షేమం అని చెప్పి ఐదేళ్ళు మోసం చేసిందని, చివరి సంవత్సరం జనవరి 2018లో 100 కోట్లు ప్రకటన చేసి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం ప్రవాసుల మాటే తీయలేదని అలాంటప్పుడు గల్ఫ్‌ ఎన్నారైలు తెరాసకి ఓటు ఎలా వేస్తారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కె ఓటు వేయాలని గల్ఫ్‌ ఎన్నారైలకి వారి కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు.

ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు లండన్‌ ఎన్నారై గంప వేణుగోపాల్‌ మాట్లాడుతూ, కెసీర్‌ రెండవ విడత వంద రోజుల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని, ఏ ఏ శాఖల్లో ఏమి పనులు ప్రారంభించారో ప్రజలకి చెప్పాలని తెలిపారు. జనవరి 2018 లో ప్రకటించిన వందకోట్లలో వంద రూపాయలు కూడా ఎందుకు విడుదల చేయలేదో ఎన్నారైలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెసు బహరేన్‌ తెలంగాణ శాఖ ప్రతినిధులు సంజీవ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎంపీ కవిత తన నియోజకవర్గం నుండి గల్ఫ్‌ ప్రవాసులు ఎక్కువని వారికి ఆసరాగా ఉంటానని 2014లో చెప్పి ఐదు సంవత్సరాలు గా ఎలాంటి చర్యలు చేబట్టలేదని, గల్ఫ్‌ ఎన్నారైలు ఈ సారి కాంగ్రెస్‌ అభ్యర్ధి మధు యాష్కీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

రాజేశ్వర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఎన్నారై మంత్రి రామారావు 2016లో ఒక ఎన్నారై మీటింగ్‌ పెట్టి పత్రికా ప్రకటనలకే పరిమితం అయ్యారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కె ఓటు వేయాలని తెలిపారు. విజయ్‌ మార్తాడ్‌ మాట్లాడుతూ తెరాస, బీజేపీ దొందు దొందేనని ఎన్నారైలకి చేసిందేమి లేదని ప్రవాస కుటుంబాలకు ఆసరా ఉంటే అని ప్రకటించిన రాహుల్‌ గాంధీ వెంటే ఎన్నారైలు నిలవాలని కోరారు. అవదూత నరేష్‌ మాట్లాడుతూ కెసీర్‌ మాయ మాటలకు మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవొద్దని 16 మంది తెరాస అభ్యర్థులు ఓడిపోతే ముఖ్యమంత్రి పని చేస్తారని అన్నారు. యూరోప్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌, బహ్రెయిన్‌ ఎన్నారైలు నిజామాబాద్‌లో తెరాస అభ్యర్థి కవితని ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్ధి మధు యాష్కీగౌడ్‌ని గెలిపించాలని పత్రికా ముఖంగా తెలియజేసారు.

కార్యక్రమంలో గంప వేణుగోపాల్‌, సంజీవ్‌ బురం, రాజేశ్వర్‌ గౌడ్‌ పడాల, విజయ్‌ మార్తాడ్‌, అవదూత నరేష్‌, గంగాధర్‌, రాయమల్లు, చిన్న, మహేష్‌, శరత్‌, సురేష్‌ ,శ్రీనులు పాల్గొని నిజామాబాద్‌లో మధుయాష్కీకె ఓటు వేయాలని ఉమ్మడి ప్రకటన చేశారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article