Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న శ్రీనివాస్‌ యాదవ్‌

ప్రజల మనిషి ఎంపి కవితని గెలిపించాలి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4

  • టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ఎంపీ అభ్యర్థి ఎంపి కవిత ప్రజల మనిషి అని గత ఐదేళ్లలో 15 వేల కోట్లు రూపాయలు నిధులు తీసుకురావడం, అలాగే పసుపు సాధన కోసం పసుపును పండిస్తున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారని టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చివరికి పార్లమెంట్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కొరకు ప్రయివేటు బిల్లును కూడా పెట్టారని అన్నారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో టిఆర్‌ఎస్‌వి జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌. నాయకులు ప్రశాంత్‌ యాదవ్‌, రఘురాం, గణేష్‌, వంశీరావు, రాజ్‌ కుమార్‌, గులభ్‌ సింగ్‌, మనోజ్‌, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బిసిల‌ అభివృద్దిని పట్టించుకునే సమయం ప్రభుత్వానికి లేదు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ సర్కారుకు బీసీ ఓట్ల పై ఉన్న ప్రేమ ...

Comment on the article