Breaking News

తెరాస అభ్యర్థిని గెలిపించాలి

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

బాన్సువాడ, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానిమంత్రి అయ్యే సత్తా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. గురువారం బాన్సువాడలోని భారత్‌ గార్డెన్స్‌లో ముస్లిం మైనార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస చేపడుతున్న అభివృద్ది పనులే గెలుపునకు బాటలవుతున్నాయని అన్నారు.

జహీరాబాద్‌ పార్లమెంటు అభ్యర్థి బి.బి.పాటిల్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. 16 మంది తెరాస ఎంపిలు గెలిస్తే కేంద్రంలో తెరాస ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దేశంలోని ఇతర పార్టీలు ఇప్పటికే రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. అంతకుముందు హోంశాఖ మంత్రికి దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఘనస్వాగతం పలికి సత్కరించారు. కార్యక్రమంలో తెరాస అభ్యర్థి బి.బి.పాటిల్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, ఎజాజ్‌, జంగం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

శాంతి, ప్రేమను బోధించిన శాంతి దూత యేసు క్రీస్తు

బాన్సువాడ, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో తెరాస పార్టీ ...

Comment on the article