Breaking News

వెద‌ర్ చేంజ్‌

గాలి…దుమారం…వర్షం….

ఇందూరు, ఏప్రిల్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు చల్లబడ్డది… గురువారం రోజంతా కొంత చల్లదనంగా ఉన్నప్పటికి సాయంత్రం సమయానికి చల్లటి గాలులు వీశాయి. రాత్రికి కొద్దిపాటి వర్షం కూడా కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఇదివరకే తెలిపింది. విదర్భ తీరాన్ని ఆనుకొని చత్తీస్‌గడ్‌ ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావం ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article