Breaking News

Daily Archives: April 6, 2019

మండవ కారెక్కారు

హైదరాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిడిపి సీనీయర్‌ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వెంకటేశ్వర రావుతో పాటు కాంగ్రెస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర కూడా తెరాసలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రవిచంద్ర పోటీ చేశారు. వీరిద్దరు నేతలకు సిఎం కెసిఆర్‌ పార్టీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

Read More »

కుస్తీపోటీల్లో గెలుపొందిన యువతి మహిమరాథోడ్‌

వేరువేరు గ్రామాల్లో- గంట వ్యవధిలో రెండు చోట్లా యువతి గెలుపు రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెంజల్‌ మండలంలోని బొర్గం, కల్యాపుర్‌ గ్రామాల్లో కుస్తీపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తరతరాలుగా ఇట్టి గ్రామాల్లో కుస్తీపోటీల నిర్వహణా జరుగుతుంది. కల్యాపుర్‌లో యువతితో కుస్తీ తలపడి గెెలుపొందినవారికి 5వేలు ప్రకటించగా యువతిదే పైచేయి అయ్యింది. అదేవిదంగా మండలంలోని బోర్గంలో సైతం ఆమెకె వేయి రూపాయల విజయం వరించింది. గ్రామసర్పంచ్లు నిరంజని, వాణి, మండల పోలీసుల ఆద్వర్యంలో కుస్తీపోటీలు ...

Read More »

ఓసిలకు పది శాతం రిజర్వేషన్‌ పట్ల హర్షం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓసిలకు కేంద్రంలోని మోడి ప్రభుత్వం పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడం పట్ల తెలంగాణ బ్రాహ్మణ సంఘాల జేఏసి రాష్ట్ర ఛైర్మన్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. 72 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో అన్నిపార్టీలు ఓసిలను మరిచిపోగా మోడిప్రభుత్వం ఆర్థిక వెనుకబాటును గుర్తించి ఓసిలకు రిజర్వేషన్‌ కల్పించడం విప్లవాత్మక నిర్ణయమన్నారు. సమాజంలో మార్పునకు ఇది తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌డిఎ ప్రభుత్వానికి ...

Read More »

యువకుని రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా ప్రయివేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ శనివారం సకాలంలో రక్తం అందించి ప్రాణాలు కాపాడాడు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన స్వర్ణలతకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో మహిళ తరఫు బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. ప్రయివేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ రక్తదానం చేశారు. కార్యక్రమంలో కుంబాల లక్ష్మణ్‌, నరేశ్‌, టెక్నిషియన్‌ ప్రమోద్‌ తదితరులున్నారు.

Read More »

బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బిజెపి కార్యాలయంలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వేసిన పునాదులపై నిర్మితమై దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా వాదానికి కట్టుబడి అటల్‌జీ ఆశయ సాధన కోసం పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, తదితర అగ్రనేతల మార్గదర్శకంలో నరేంద్ర మోడి, అమిత్‌షా నాయకత్వంలో ...

Read More »

బిజెపి కార్యాలయంలో పంచాంగ శ్రవణం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో శనివారం ఉగాది పండగ పురస్కరించుకొని పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో వర్షాలు పుష్కలంగా కురిసి, రైతుల పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ది చెందాలని, యువత కొత్త ఆశలు, ...

Read More »

ఘనంగా ఎడ్లబండ్ల ఊరేగింపు

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఉగాది పండగ పురస్కరించుకొని వీక్లి మార్కెట్‌లో ప్రతి యేటా ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ యేడు సైతం ఎడ్లబండ్లను అందంగా ముస్తాబు చేసి మార్కెట్లో ఊరేగించారు. ఎడ్లబండ్ల ఊరేగింపు తిలకించేందుకు పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఎండ్లబండ్ల ఊరేగింపు సందర్బంగా ఎలాంటి సంగటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు.

Read More »

ఓటర్లకు అవగాహన కార్యక్రమం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు విస్తతమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం మధ్యాహ్నం నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌ లోకసభ ఎన్నికల్లో 185 గుర్తులు ఉన్నాయని అందుకోసం 12 బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేసినందున ప్రజలలో ...

Read More »

ఘనంగా వికారి నామ ఉగాది వేడుకలు

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం వికారి నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉదయం నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలు వితరణ చేశారు. ఆలయాల్లో పురోహితులు సంజీవులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడి వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనురాధ సత్యనారాయణ, నాయకులు బలరాం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

అయ్యప్ప ఆలయంలో స్పీకర్‌ ప్రత్యేక పూజలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్తకొండ భాస్కర్‌, గురుస్వామి వినయ్‌ వీరిని స్వాగతించి ప్రత్యేకంగా సత్కరించారు. ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరంలో ఉండాలని ఈ సందర్భంగా స్పీకర్‌ కోరారు. కార్యక్రమంలో ...

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

బీర్కూర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది పండగ సందర్బంగా బీర్కూర్‌ హనుమాన్‌ కమిటీ ఆద్వర్యంలో మండల కేంద్రం లో పోలీస్‌ స్టేషన్‌వద్ద ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మల్లయోధులు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుండీ తరలివచ్చారు. కుస్తీ పోటీలు చూడటానికి వివిధ ప్రాంతాల నుండి భారీగా ప్రజలు తరలివచ్చారు. చివరి కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లయోధునికి ఉగాది కమిటీ ఆద్వర్యంలో శాలువా కప్పి 2100 నగదు అందించారు. కార్యక్రమంలో ఉగాది ...

Read More »

చారిత్రక ఎన్నికల ఘట్టంలో భాగస్వాములైన అందరికీ కతజ్ఞతలు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ చరిత్రలో నిజామాబాద్‌ పార్లమెంటుకు జరిగే ఎన్నికలు చారిత్రకంగా నిలువబోతున్న క్రతువులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి తన యొక్క కతజ్ఞతలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. శనివారం ఆయన ఈవీఎంల ప్రథమ స్థాయి చెకింగ్‌ జరుగుతున్న సుగుణ గార్డెన్‌, అమ త గార్డెన్‌, విజయలక్ష్మి గార్డెన్లలో పరిశీలించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నిజామాబాద్‌ లోక్‌ సభ ...

Read More »

ఘనంగా ఉగాది వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం వికారి నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉదయం నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల్లో పురోహితులు పంచాంగ శ్రవణన్నీ వినిపించారు. అనంతరం కళ్యాపూర్‌, తాడ్‌బిలోలి గ్రామాల్లోని యువకులు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో రూపేష్‌, శుభమ్‌, నాగనాథ్‌, నవీన్‌, గంగప్రసాద్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రధాని మోదీకి బాసటగా నిలుద్దాం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రదాని మోదీకి బాసటగా నిలుద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది కార్యకర్తల త్యాగాలు, శ్రమ ఫలితంగా బిజెపి 20 రాష్ట్రాలలో, కేంద్రంలో అధికారంలో ఉందన్నారు. ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో ఆగ్రగ్రామీ దేశంగా రూపొందించడానికి మోడీ పడుతున్న తపనకు మనమందరం కూడా నిరంతరం ...

Read More »

మద్దతు ధర కోసం కృషి చేస్తా

మధుగౌడ్‌ యాష్కీ ఆర్మూర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబెడ్కర్‌పై ప్రమాణం చేసి ముఖ్యమైన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు ఏఐసిసి కార్యదర్శి మధుగౌఢ్‌ యష్కీ అన్నారు. ఈ మేరకు ఆర్మూర్‌ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నకు కనీస మద్దతు ధర, ఎన్‌ఐ పాలసీ కొరకు కషి చేస్తానని హామీ ఇచ్చారు. పసుపు, ఎర్రజొన్న తదితర పంటలను ...

Read More »

మధుయాష్కీ గౌడ్‌కు మద్దతు

టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓయు ఐకాస వ్యవస్థాపక కన్వీనర్‌ పున్నా కైలాష్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేస్తున్న మధు యాష్కీ గౌడ్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని టీపిసిసి అధికార ప్రతినిధి ఓయు ఐకాస వ్యవస్థాపక కన్వీనర్‌ పున్నా కైలాష్‌ నేత తెలిపారు. ఈ మేరకు శనివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిఖార్సయిన ఉద్యమకారుడు పోరాటయోధుడు ఉద్యమాలను త్యాగాలను విస్మరించిన కేసీఆర్‌కు ...

Read More »

వికారాది ప్రకతి

వికారాది ప్రకతి వైపరీత్యాల చిహ్నం కానీ కావాలి ఆనంద ఖేలీ కోకిల కూతలు వసంతోత్సవ వయ్యారాలు ప్రకతి నేలువ పల్లె సంస్కతి సౌరబాలు ఊరు దేవతల చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శనలు పోలేలు, పులిహోర కమ్మనైన వంటలు కోలాటాలు, జడకొప్పుల ఆటలు పచ్చడి షడ్రుచుల సంగమం ఆరోగ్య ప్రదం గ్రామ చావిడిల్లో పంతులు పంచాంగం ఇది ఒక రుతువు పండుగ కలిమి లేమి లేరుగక ఊరంతా జరుపుకునే ఊరు పండుగ గ్రామ సమైక్యతను చాటే జాతి పండుగ వ్యవసాయదారుల క్రయ విక్రయాల ఖాతా పుస్తకాల ...

Read More »

పంచ చామరలు

వికారి వర్షమేగుదెంచె విందుజేతునంటు తా అకల్కమేను తోరణంబు ఆకసంపు పందిరిన్‌ పికాల సవ్వడుల్‌ విపంచి పిల్పులే వికారికిన్‌ అకుప్యమంటి పల్లవాల హారతిన్‌ వికారికిన్‌ వ్యయంబు జేయకే మధూలి పట్టిదెచ్చె ఆమనే భయంబు లేక ముందుకేగి వండిదెచ్చె బెల్లమున్‌ ప్రయాసమింతలేక వేపవల్లరీలు దెచ్చెతా స్వయంగ శోధనమ్ముజేసి సంవరాలు దెచ్చెతాన్‌ వసంతమే ప్రియంగనిచ్చె బానలోని పచ్చడిన్‌ భువన్యు భంగి ఒమ్మికైన పూపమున్‌ వికారికిన్‌ స్థిరమ్ముగా భుజింపుమంటు చేదలోన బెట్టుచున్‌ పరాకు లేక ఆమనేను వంచెతాన్‌ వికారికిన్‌ వికారి వత్సరంబులోన వీచుగాలు లెంతనో వికారి వర్ణమందు పంట, పేయమెంత ...

Read More »

”వికారినామ ఉగాది”

ఉగాది పండుగ వచ్చింది ఉత్సాహాన్నే తెచ్చింది మామిడిపిందెల వేపపువ్వుల చెరుకుముక్కల చింతపులుపుతో కొత్తబెల్లమూ కోరిన రుచులు షడ్రుచుల మేళవింపుతో వికారి నామ వుగాది వచ్చింది కుహూ కుహూ కోయిల రాగాలతో రామచిలకల కోలాహలముతో కొత్తఅల్లుళ్ళ సందళ్ళతో కోరికలు తీర్చే కొత్త ఉగాది రానేవచ్చింది! నవవసంతంలా మనజీవితం మమతానురాగాలతో నిండాలని కోరినకోరికలు తీరాలని కష్టసుఖాలను సమంగా స్వీకరిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం గత చేదుజ్ఞాపకాల్ని విడిచిపెట్టి కొత్తజీవితం ఆరంభిద్దాం రాబోవు ఎన్నికల్లో నిజాయితీపరుల్ని గెలిపిద్దాం మనరాతల్ని మార్చుకొని రాబోవు తరాలకు రాచబాటవేద్దాం అనల 8008694322

Read More »