సీఈఓ రజత్‌కుమార్ హైదరాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో 11 వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని సీఈఓ రజత్ కుమార్ స్పష్టం చేశారు. 2 కోట్ల 97లక్షల 8599 మంది ఓటర్ల ఉన్నారని, సర్వీస్ ఓటర్లు 11 వేల 320, ఎన్నారై ఓటర్లు 11 వేల 731, మొత్తం 34 వేల 604 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ...
Read More »Daily Archives: April 8, 2019
తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిది
ఎంపి కవిత మెట్పల్లి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెట్ పల్లి బార్ అసోసియేషన్ నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు మద్దతు తెలిపింది. సోమవారం ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు నివాసంలో ఎంపి కవితని బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రీ, సీనియర్ లాయర్లు రాజ్ మహమ్మద్, ఆనంద్ గౌడ్, వెంకట నరసయ్య, తెడ్డు ఆనంద్, ఆకుల సురక్ష తదితరులు ఎంపినీ కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ...
Read More »దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి
ప్రాంతీయ పార్టీల కూటమితో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం : ఎంపి కవిత మెట్పల్లి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ ఉండాల్సిన ప్రధాని తెలంగాణ, ఆంధ్ర ఇతర రాష్ట్రాల్లో తలదూర్చడం ఎంతవరకు సబబు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ అడుగుతున్నారని చెప్పారు. సోమవారం మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ సమీపంలో జరిగిన రోడ్ షోలో ఆమె ప్రసంగించారు. ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోయిందని, రాహుల్ గాంధీ పరిస్థితి కూడా ...
Read More »నిజామాబాద్ ఎన్నికల పైస్టే ఇవ్వలేమన్న హైకోర్టు
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఎన్నికల పైస్టే ఇవ్వలేమని, ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ఎన్నికలపై వాదనలు ముగిసిన అనంతరం పై విషయాన్ని వెల్లడించారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులకు గుర్తులు కేటాయించలేదని, ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టును కోరారు. కాగా వాయిదా వేయలేమని హైకోర్టు పేర్కొంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి, ...
Read More »ప్రాజెక్టులు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ
వడ్డెపల్లి సుభాష్ రెడ్డి నిజాంసాగర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాజెక్టులు నిర్మించి పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకె దక్కిందని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే నిర్మించిన ప్రాజెక్టులన్నీ మాయని చెబుతున్నారని అన్నారు. ఎంపీ బీబీ పాటిల్ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు చేసిన పని ఏదీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల్లో అభివద్ధి జరిగిందని టిఆర్ఎస్ పాలనలో ...
Read More »ఇందూరు నగరం కాషాయమయం..
రాజాసింగ్ రాకతో దద్దరిలిల్లన నిజామాబాద్ నగరం నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ దేశానికి ఎలాంటి పిఎం కావాలో నిర్ణయించుకునే ఎన్నికలని, వీటికి రాష్ట్ర పార్టీలకు సంబంధం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలో ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ర్యాలీకి రాజాసింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కనీసం పార్లమెంటుకు కూడా పోకుండా ప్రజలను లూఠీ చేసేవారు కావాలా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్లు డబ్బులతో దిగుతారని జాగ్రత్తగా ...
Read More »తెరాసతోనే పేదలకు మేలు
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెరాసతోనే పేదలకు మేలు జరుగుతుందని నిజామాబాద్ తెరాస అబ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీ కవిత పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకొని సీఎం కెసిఆర్ ఫించన్లు ఇస్తున్నారన్నారు. మే నుంచి రూ.2,016 ఫించన్లు వస్తున్నట్లు ఆమె తెలిపారు. గంగ పుత్రులు, యాదవ సోదరులు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలకు ...
Read More »మాట తప్పిన బీజేపీ
ఎంపి కవిత ఆర్మూర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్మూర్ డివిజన్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బిజెపి మాట తప్పిందని తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా, అర్మూర్లో పర్యటించిన కవిత మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కాదు అని భారతీయ జాటా పార్టీ అని మేం చెప్పిందే నిజమైందన్నారు. మొన్న ఆర్మూరు సభలో బిజెపి నాయకుడు రామ్‌మాధవ్ పసుపు బోర్డు ఏర్పాటు, రైతుల కష్టాలు గురించి మాకు తెలియదు..అన్నారు అని అసలు ...
Read More »ముళ్ల పొదల తొలగింపు
నిజాంసాగర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముళ్ళ పొదలను తొలగిస్తున్నామని లైన్‌మైన్ సుదర్శన్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ మండలంలోని హెడ్స్లూస్ నుంచి హసన్‌పల్లి గేట్ వరకు విద్యుత్ తీగలు వెళుతుండడంతో ముళ్ల పొదలు వాటికి తగులుతున్నాయన్నారు. వాటివల్ల కరెంటు ఇబ్బందులు కావడంతో ముళ్ల పొదలు బాగా పేరడంతో వర్షాకాలంలో తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ముళ్లపొదలు తొలగిస్తామని తెలిపారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ ...
Read More »దత్తత పాఠశాలగా బొమ్మన్‌దేవుపల్లి పాఠశాల ఎంపిక
బీర్కూర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండవ విడత దత్తత పాఠశాల కార్యక్రమంలో భాగంగా పిఆర్టియు నసురుల్లాబాద్ శాఖ జడ్పిహెచ్ఎస్ బొమ్మన్‌దేవుపల్లి పాఠశాలను ఎంపిక చేసుకుంది. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ గ్రామస్తుల సమావేశంలో మాట్లాడారు. గతంలో యుపిఎస్ మైలారం, యుపిఎస్ అంకోల్ తాండాలను అభివద్ధి చేసుకున్నామని ఇప్పుడు బొమ్మనుదేవ్పల్లి పాఠశాలను అభివద్ధి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ మెంబర్ మాజిద్, పిఆర్టియు నసురుల్లాబాద్ అధ్యక్షులు కొప్పిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి హన్మండ్లు, జిల్లా ...
Read More »మధుయాష్కీకి మద్దతుగా ప్రచారం
రెంజల్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ గెలుపు కోసం సోమవారం మండలంలోని తాడ్‌బిలోలి, రెంజల్, బొర్గం, సాటాపూర్ గ్రామాల్లో మండల అధ్యక్షుడు సాయరెడ్డి, జడ్పీటిసి నాగభూషన్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేసి మధుయాష్కీ గౌడ్‌ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం కషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ...
Read More »కారు ప్రచారంలో కవిత ఆడపడుచు
రెంజల్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియనుండడంతో రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో పార్లమెంట్ సభ్యురాలు కవిత ఆడపడుచు అఖిల సోమవారం రోజున ఇంటింటా తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి తమ వదినను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కవితకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. రైసస జిల్లా సభ్యుడు మౌలానా, రైసస గ్రామ అధ్యక్షుడు దత్తుపటేల్ ఆధ్వర్యంలో 150 మంది కార్యకర్తలతో కవిత ఆడపడుచు అఖిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బడుగు బలహీన ...
Read More »