Breaking News

పకడ్బందీ ఏర్పాటు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే లోక్‌సభ ఎన్నికల సిబ్బందికి అందించే సామాగ్రి అన్ని సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయతో కలిసి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఇక్కడ నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలుగా నిర్వహిస్తున్నందున ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి పూర్తి సామాగ్రి అందించడానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

ప్రతి కౌంటర్‌కు ఒక డి.టి. కానీ తహసిల్దార్‌ కానీ బాధ్యులుగా ఉంచాలని ఈ రెండు నియోజకవర్గాలతోపాటు 11వ తేదీన ఇతర నియోజకవర్గాల నుండి కూడా ఈవీఎంలు వస్తాయని వాటిని కూడా భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే వాహనాలకు ఎదురెదురుగా ఇబ్బందులు కలగకుండా దారులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇవిఎంలు తరలించే కూలీలకు టీ షర్టులు అందించాలన్నారు.

ఎన్నికల సిబ్బందికి చట్టబద్ధమైన, ఇతర కవర్లను వేరువేరుగా అందించాలన్నారు. అన్ని స్ట్రాంగ్‌ రూమ్‌లకు పకడ్బంది భద్రతను బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా సిబ్బందిని నియమించి 24 గంటలు జాగ్రత్తగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్‌ కుమార్‌, మున్సిపల్‌ ఎస్‌ ఇ రత్నాకర్‌, ఆర్డీవో నిజామాబాద్‌ వెంకటేశ్వర్లు, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *