Breaking News

ఎక్సైజ్‌ శాఖ విస్తృత దాడులు

భారీగా మద్యం స్వాధీనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు బృందం ఆద్వర్యంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన మద్యం స్థావరంపై టాస్క్‌పోర్సు పోలీసులు, భీమ్‌గల్‌ ఎక్సైజ్‌ బృందం సంయుక్తంగా దాడి జరిపి 54 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. దాంతోపాటు 62 లీటర్ల బీరు స్వాదీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సిఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ అక్బర్‌ తెలిపారు.

అదేవిధంగా మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బషీరాబాద్‌ సమీపంలో ఎన్నికల బృందం, మోర్తాడ్‌ ఎక్సైజ్‌ బృందం జరిపిన రూట్‌వాచ్‌లో ఓ మారుతి కారులో అక్రమంగా తరలిస్తున్న 46.8 లీటర్ల బీరు, 3 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. హసన్‌కొత్తూరు సమీపంలో హీరోహోండాపై మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్దనుంచి 13.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు టీం, ఎక్సైజ్‌ సిఐ శేఖర్‌, సిఐలు యాదగిరి, మమత, సిబ్బంది పాల్గొన్నారు.

డిస్ట్రిక్‌ టాస్క్‌పోర్సు టీం ఆద్వర్యంలో బోధన్‌ డివిజన్‌ పరిధిలో అక్బర్‌నగర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇంటిపై దాడిచేసి 6 లీటర్ల మద్యం, 5.5 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దాడుల్లో ఎక్సైజ్‌ టాస్క్‌పోర్సు సిఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ స్రవంతి, సిబ్బంది ఉన్నారు.

సిఐ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా 9వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ ఎన్నికలు ముగిసేరోజున జిల్లా వ్యాప్తంగా వైన్సులు, బారులు, క్లబ్బులు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని, జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌చంద్‌ ఆదేశానుసారం దాడులు చేసినట్టు ఆయన వివరించారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముతున్నట్టు సమాచారం అందితే 08462-2377601 నెంబరుకు సమాచారం అందించాలన్నారు.

Check Also

గ్రామ సమస్యలు పరిష్కరించండి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామ తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య పరిస్కారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *