Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న ఎంపి కవిత

పార్లమెంట్‌ నియోజకవర్గ అభివద్ధికి అన్ని విధాలా కషి చేస్తా

ఎంపి కవిత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11న జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో తనను నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలిపిస్తే నియోజకవర్గ అభివద్ధికి అన్ని విధాలా కషి చేస్తానని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని స్థానిక ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఎన్నికలలో జిల్లా ప్రజలు తనను మంచి మెజారిటీతో గెలిపించారని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి నిజామాబాద్‌ రైల్వే లైన్‌ పూర్తి చేశామని వెల్లడించారు.

ఇంటింటికి నీరిస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. నిజాంసాగర్‌ ఆయకట్టు ద్వారా రెండు లక్షల ఎకరాల స్థిరీకరణ చేశామని, నిజామాబాదు లోకసభ లోని నిజామాబాద్‌ అర్బన్‌ కాకుండా మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించేలా క షి చేశామని పేర్కొన్నారు. పసుపు బోర్డు సాధన కోసం కషి చేశానని, మరోసారి గెలిపిస్తే నిజామాబాదు జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజాం షుగర్స్‌ పునరుద్ధరణ, లక్కంపల్లి సెజ్‌ వంటివి పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో పెద్దయెత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని, సంక్షేమ కార్యక్రమాల సంఖ్య పెంచుతామన్నారు.

గ్రూప్‌ మహిళలకు చేతినిండా పని కల్పిస్తామని, పేదల సొంతింటి కల సాకారం చేయిస్తామని, కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు కషి చేస్తున్నా మన్నారు. ముస్లిములకు పన్నెండు శాతం రిజర్వేషన్లు వంటివి సపలీకతం అయ్యేందుకు తెరాసను రాష్త్ర వ్యాప్తంగా గెలిపించాలని కోరారు. 16 స్థానాలలో తెరాస అభ్యర్థులతో పాటు ఎంఐఎం నేత అసదుద్దిన్‌ను గెలిపించాలని, బిజెపి వలలొ పడకుండా మైనారిటీలు తెరాసకు ఓటేయాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశం లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *