Breaking News

నిజామాబాద్‌న్యూస్‌ చెప్పిందే నిజమైంది…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11న ఏదేమైనా పోలింగ్‌ జరిగి తీరుతుందని గణాంకాల ద్వారా మొదట చెప్పింది నిజామాబాద్‌న్యూస్‌.ఇన్‌. 185 మంది బరిలో ఉండడంతో పోలింగ్‌ తేదీ వాయిదా పడుతుందేమోనని సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. పోలింగ్‌ బ్యాలెట్‌తో నిర్వహిస్తారా సాధ్యాసాధ్యాల గురించి విస్తృతంగా చర్చ జరిగింది. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, బ్యాలెట్‌ బాక్సులు, వాటి తయారీ, రవాణా వీటన్నింటిపై అందరు చర్చించుకున్నారు. ఒకవేళ ఈవిఎం యంత్రాల ద్వారా పోలింగ్‌ నిర్వహించాలనుకుంటే ఎన్ని ఈవిఎంలు, వీవీప్యాట్‌లు, కంట్రోల్‌ యూనిట్స్‌ వాటి రవాణా, అందుకు సంబంధించిన ఇంజనీరింగ్‌ వ్యవస్థ వీటిపైన కూడా లెక్కలేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు 185 మంది రైతులు నామినేషన్‌వేసి దేశంలో, రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాలనుకున్నారు. ప్రభుత్వానికి నామినేషన్‌ ద్వారా నిరసన తెలపాలనుకున్నారు. కానీ నైతికంగానే ఓడిపోయారు. ఎక్కువమంది నామినేషన్లు వేస్తే పోలింగ్‌ తేదీ వాయిదా పడుతుందేమోనని భావించారు కాబోలు అదీ సాధ్యం కాలేదు. రైతులు నామినేషన్‌ వేయాలనుకున్న ఉద్దేశం మాత్రం విఫలమైంది. పైగా ఇందూరు గిన్నీస్‌ రికార్డు కూడా సాధించబోతుంది.

ఎక్కువ మంది నామినేషన్లు వేయడం వల్ల పాలనాపరంగా ఎన్ని ఇబ్బందులెదురైనా పోలింగ్‌ జరిపి తీరాలని ఎన్నికల కమీషన్‌ కూడా చాలెంజ్‌గానే తీసుకున్నట్టు అనిపించింది. ఎన్నికల పరంగా అత్యంత ఖర్చుతో కూడుకున్న పార్లమెంటరీ ఎన్నికలు నిజామాబాద్‌లో 600 మంది ఇంజనీర్లు, 26 వేల 800 ఓటింగ్‌ మిషన్లు, సిబ్బంది, యంత్రాల రవాణా వసతులు ఇవన్ని భారీ ఖర్చుతో కూడుకున్నవి. పాలనా పరంగా అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్ళు పనిచేయాల్సి వస్తోంది.

Check Also

మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న మునిసిపల్‌ చట్టం 2019 ని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *