Breaking News

Daily Archives: April 11, 2019

పలు గ్రామాల్లో మొరాయించిన ఈవీఎంలు

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని దూపల్లి, కందకుర్తి, వీరన్న గుట్ట గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఓటు వేసేందుకు వచ్చినవారు పోలింగ్‌ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలు మొరయించడంతో ఓటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఈవీఎంలు పని చేయడం లేదని అధికారుల దష్టికి తీసుకెళ్లడంతో, సంబంధిత అధికారులు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ...

Read More »

పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎంపీ కవిత

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ సరళిని తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. తెరాస కార్యకర్తలతో పోలింగ్‌ జరుగుతున్న తీరును ఆరాతీశారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఓటింగ్‌ శాతాన్ని పెంచేవిధంగా కషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

Read More »

సామాజిక శాస్త్రవేత్త జ్యోతిబా ఫూలే

బీర్కూర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొప్ప సామాజిక శాస్త్రవేత్త, కవి, సంఘసంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, విద్యా వంతుడు, వివేకుడు, గొప్ప దార్శనికత కలవాడు జ్యోతిబా ఫూలే అని పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తా, అంబేద్కర్‌ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతి రావ్‌ పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతు మహాత్మా జ్యోతి రావ్‌ పూలే ఏప్రిల్‌ 11, 1827న మహారాష్ట్రలోని సతర ప్రాంతంలో, పూలు అమ్ముకునే ...

Read More »

రెంజల్‌లో ప్రశాంతంగా పార్లమెంట్‌ ఎన్నికలు

రెంజల్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో 34 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కొత్తగా నమోదైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్‌ రూరల్‌ సిఐ షకీర్‌ ఆలీ, ...

Read More »

ఓటింగ్‌ పట్ల ఆసక్తి చూపిన యువ ఓటర్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జరిగిన జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల్లో తాజాగా ఓటు హక్కుపొందిన యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహాన్ని చూపారు. ఏ పోలింగ్‌ కేంద్రాన్ని చూసినా యువ ఓటర్లు అధిక సంఖ్యలో దర్శనమిచ్చారు. యువ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనడం ఆనందకర విషయమని అధికారులు చెప్పారు. ఓటు హక్కు పట్ల ప్రతి ఒక్కరికి చైతన్యం ఉండాలని, ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే వారి భవిస్యత్తును వారు నిర్ణయించుకోగలరని అధికారులు పేర్కొన్నారు.

Read More »

ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే 191వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఫూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు ఇతర అదికారులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబాఫూలే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అక్షరాస్యత కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రె, ఆయా శాఖల అదికారులు ఝాన్సీ, అలీం, తదితరులు ...

Read More »

వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ఎన్నికల పరిశీలన

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు పరిధిలో గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌క్యాస్టింగ్‌ రూం ద్వారా జిల్లా అధికారి సత్యనారాయణ పరిశీలించారు. వెబ్‌క్యాస్టింగ్‌ రూం నుంచి ఎన్నికల సరళిని, ఓటింగ్‌ జరుగుతున్న తీరును, ఇతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు. వెబ్‌ క్యాస్టింగ్‌లో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రె, వెబ్‌క్యాస్టింగ్‌ నోడల్‌ అధికారి ...

Read More »

మహిళా పోలింగ్‌ స్టేషన్‌ అదుర్స్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ భవనంలో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహిళా పోలింగ్‌ స్టేషన్‌ అదుర్స్‌ అనిపించింది. ఇది చూపరులను ఆకట్టుకుంది. పోలింగ్‌ స్టేషన్‌లో బెలూన్లు, ఇతర అలంకరణ సామగ్రితో ముస్తాబు చేశారు. పోలింగ్‌ కేంద్రం బయట ఐ విల్‌ ఓట్‌ బికాస్‌ ఐ లవ్‌ కామారెడ్డి అనే బోర్డు ఉంచారు. మహిళల ఓటింగ్‌ శాతంపై ప్రత్యేక దృష్టి సారించి మహిళా పోలింగ్‌ బూత్‌ రూపొందించారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్‌, డిప్యూటి కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేవునిపల్లి గ్రామం పోలింగ్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఆయన సతీమణి గంగాభవాని అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రెలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 786 పోలింగ్‌ కేంద్రాల్లో 6 లక్షల 28 వేల 418 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఆరోగ్య సిబ్బందితో పాటు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.

Read More »

జహీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో 67.80 శాతం పోలింగ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు పరిధిలో గురువారం జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 67.80 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అదికారులు తెలిపారు. అత్యధికంగా జహీరాబాద్‌ 71 శాతం పోలింగ్‌ నమోదు కాగా, నారాయణఖేడ్‌ 66.14, ఆందోల్‌లో 70.28 శాతం, జుక్కల్‌ 66.28, బాన్సువాడ 72 శాతం, ఎల్లారెడ్డి 66.27 పోలింగ్‌శాతం నమోదు కాగా, అత్యల్పంగా కామారెడ్డి 62.80 శాతం నమోదైంది. వేసవి దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓటర్లు ఉదయం ...

Read More »

దేవి ఫంక్షన్‌ హాల్‌ ప్రారంభం

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంగ్టి మండలంలోని తడ్కల్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవి ఫంక్షన్‌ హాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను ఫంక్షన్‌ హాల్‌ యజమాని పండరి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్‌ వల్లే అభివృద్ది జరుగుతుందన్నారు. ఎంపి బి.బి.పాటిల్‌ను గెలిపిస్తే అభివృద్ది జరుగుతుందని, ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పోలింగ్‌ పర్సెంట్‌ @1 పిఎం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 38.10 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 11 గంటలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా… కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం 40 శాతం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం 38 శాతం ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం 46.30 శాతం బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం 34.34 శాతం బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం 39.20 శాతం నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ...

Read More »

పోలింగ్‌ పర్సెంట్‌ @11 ఏఎం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఉదయం 8 గంటలకు నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 13.80 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. కాగా నియోజకవర్గాల వారిగా… కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం 21 శాతం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం 20.5 శాతం ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం 20 శాతం బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం 8.66 శాతం బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం 15.01 శాతం నిజామాబాద్‌ రూరల్‌ ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎంపీ కవిత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుందన్నారు. కావునా పట్టణప్రాంత ఓటర్లు ...

Read More »