Breaking News
ఫూలే విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న అధికారులు

ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాఫూలే 191వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఫూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు ఇతర అదికారులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబాఫూలే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అక్షరాస్యత కోసం చేసిన సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రె, ఆయా శాఖల అదికారులు ఝాన్సీ, అలీం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏఐఎస్‌ఎఫ్‌ రాస్తారోకో

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ అద్వర్యంలో ఎలారెడ్డి మండల కేంద్రంలో ప్రేవేట్‌ యూనివర్సిటీలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *