Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో గురువారం ఉదయం ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

ఎంపీ కవిత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుందన్నారు. కావునా పట్టణప్రాంత ఓటర్లు తప్పకుండా ఓటేయాలని కోరారు. ఏ పార్టీకి ఓటు వేస్తామన్న దానికంటే ముఖ్యంగా ఓటు వేయడం అనేది ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు కవిత పేర్కొన్నారు.

జహీరాబాద్‌ పార్లమెంటు పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో గురువారం ఉదయం ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కాగా స్వగ్రామం పోచారంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సతీమణి పుష్పమ్మతో కలిసి మొదటి ఓటు వినియోగించుకున్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *