Breaking News

14న శ్రీరామనవమి శోభాయాత్ర

కామరెడ్డి, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామసేన ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్టు శ్రీరామసేన, విహెచ్‌పి ప్రతినిధులు తెలిపారు. 14వ తేదీన ఆదివారం కామారెడ్డిలో మొదటిసారిగా శ్రీరాముని భారీ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

కామారెడ్డి పట్టణములో ధర్మశాల నుండి పురవీదుల గుండా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు రాముని విగ్రహంతో శోభాయాత్ర ఉంటుందన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, చుట్టు పక్క గ్రామాలకు సంబంధించిన హిందూ బంధువులు, రామ, హనుమాన్‌ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.

Check Also

గ్రామ సమస్యలు పరిష్కరించండి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామ తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య పరిస్కారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *