Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న రాజలింగం

15న ఛలో హైదరాబాద్‌

జిల్లా అధ్యక్షునిగా ప్రభాకర్‌

కామరెడ్డి, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కామరెడ్డి జిల్లాలో భవన నిర్మాణరంగంలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 15న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కమిటీలో కామారెడ్డి ఓంకార్‌ సెంట్రింగ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా ఉన్న కొల్లూరి ప్రభాకర్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఐసిటియు జిల్లా బాధ్యులు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కామారెడ్డి జిల్లాలోని ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌లో గత కొంత కాలంగా నిర్మాణపరమైన సమస్యల కారణంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం దష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయి జిల్లా కమిటీని చలో హైదరాబాద్‌ అనంతరం జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించి ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అంతవరకు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్‌ తిరుపతి, జిల్లా అధ్యక్షులుగా కొల్లూరి ప్రభాకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంతంపల్లి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి తిరుపతి, జిల్లా సహాయ కార్యదర్శి రాజలింగం, రామచంద్రం, రాజులు, జిల్లా కమిటీగా కార్యక్రమం జయప్రదానికి పని చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు 3 నెలలు దాటిన కార్మికుల రెన్యువల్‌ను షరతులు లేకుండా రెన్యువల్‌ చేయించుకోవడానికి ప్రధానమంత్రి శ్రమ యోజన మండల్‌ స్కీమ్‌ పెన్షన్‌ స్కీమ్‌లో 40 సంవత్సరాల వయసు నిబంధన ఎత్తివేయాలని వెల్ఫేర్‌ బోర్డ్‌లో జమఉన్న 20 వేల కోట్ల రూపాయల నుండి కార్మికుల నుంచి చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్‌ వర్తింపచేయాలని దేశంలో 11 రాష్ట్రాల్లో అమలవుతున్న షరతుల్లేని పెన్షన్‌ స్కీం మాదిరిగా తెలంగాణలోని కార్మికులకు కూడా ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్‌ స్కీం అమలు చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న అడ్డాలలో 5 రూపాయల భోజన క్యాంటీన్లో ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు కమ్యూనిటీ భవనాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు బిల్డింగ్‌ వర్కర్స్‌ కాలనీలు నిర్మాణం చేసి ఇవ్వాలని తదితర డిమాండ్లతో తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని కార్మిక శాఖ కార్యాలయంలో గుర్తింపు కార్డులు పొందిన 13 వేల మందితో పాటు గుర్తింపు కార్డులు పొందని కార్మికులు కూడా భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్మిక కార్యాలయం సంజీవయ్య భవనం వద్ద నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో ప్రతి కార్మికుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

Check Also

గ్రామ సమస్యలు పరిష్కరించండి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగాపూర్‌ గ్రామ తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య పరిస్కారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *