Breaking News

స్ట్రాంగ్‌ రూంలను ప్రతిరోజు పరిశీలన చేయాలి

రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాష్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభ్యర్థుల రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌కు సీలు వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ స్ట్రాంగ్‌ రూముల ఏర్పాట్లకు జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో సాయంత్రం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలు సీల్‌ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం సీల్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌ నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు కూడా పాల్గొన్నారని, ఎలాంటి సమస్య లేదని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈవో జ్యోతి బుద్ధప్రకాష్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఈసిఐ నియమ నిబంధనల మేరకు స్ట్రాంగ్‌ రూమ సీల్‌ ప్రక్రియను చేపట్టాలని అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్‌ సమక్షంలో సీల్‌ పూర్తయిన తర్వాత ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారులు ఉదయం కానీ సాయంత్రం గాని వాటిని పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోలింగ్‌ స్టేషన్‌ వారిగా సిఆర్‌సి నివేదికను సిద్ధం చేసుకోవాలని ఆయన రిటర్నింగ్‌ అధికారులను, జిల్లా ఎన్నికల అధికారులను కోరారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *