Breaking News

ఎన్నికల ఖర్చుకు డబ్బులుంటాయి, కార్మికులకు ఉండవు

ఐదవ రోజు కార్మికుల ధర్నా

కామరెడ్డి, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఐదవ రోజు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్‌ కాంట్రక్టు ఎంప్లాయిస్‌ వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ( ఏఐటియుసి అనుబంధ సంస్థ) ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక మూడు నెలలు గడుస్తుందని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

కార్మికులు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తెచ్చుకున్న అప్పులు, వడ్డీలు కట్టలేక అద్దెలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల ఖర్చులకు మాత్రం డబ్బులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెల వచ్చింది అంటే డబ్బులు ఇస్తారని ఆసుపత్రి కార్మికులకు మాత్రం సక్రమంగా జీతాలు ఇవ్వని ప్రభుత్వం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వాలకు కార్మికులపై సవతి ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని అన్నారు. కలెక్టర్‌, డిఎంహెచ్‌వో పట్టించుకోకపోవడం సిగ్గు చేటని ప్రభుత్వాలు పర్యటనల పేరుతో అనేక డబ్బును వధా చేస్తున్నాయి, కానీ కార్మికులను మాత్రం పట్టించుకోకపోడం బాధాకరమన్నారు.

వెంటనే అధికారులు చొరవ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి పి.బాలరాజు, రఫిక్‌, ఫాజియా, స్వరూప, మమత, నర్సింలు, సందీప్‌, సునీత, లక్ష్మీ, గంగాధర్‌, బైరమ్మ, దయాకర్‌, 30 మంది కార్మికులు ఉన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *