Breaking News

స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీలింగ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఎన్నిక పూర్తయిన సందర్భంగా ఈవిఎంలను భద్ర పరచటానికి స్ట్రాంగ్‌ రూంలలో ఉంచి సీలింగ్‌ వేశారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ, సాధారణ పరిశీలకులు గౌరవ్‌ దాలియా, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలకు తాళాలు వేసి లక్కతో సీల్‌ వేశారు. నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ, బోధన్‌, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంటు ఎన్నికలకు ఉపయోగించిన వివి ప్యాట్లను, బ్యాలెట్‌ యూనిట్లను, కంట్రోల్‌ యూనిట్లను ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన గదులలో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉంచి సీల్‌ వేశారు.

వాటితో పాటు ఎన్నికలకు ఉపయోగించని ఈవిఎంలు, చెడిపోయిన ఈవీఎంలను ఉంచిన గదులకు కూడా వేర్వేరుగా సీల్‌, తాళాలు వేశారు. సీల్‌ అనంతరం అభ్యర్థులు వారి ప్రతినిధులు సీల్‌పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఫారం-17 ఏ ఇతర డాక్యుమెంట్లు పరిశీలించి స్క్రూటీనీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో తక్కువ పోలింగు అయిన పోలింగ్‌ కేంద్రం, అత్యధికంగా ఓటింగ్‌ జరిగిన పోలింగ్‌ కేంద్రాలయొక్క ప్రిసైడింగ్‌ అధికారి డైరీ పరిశీలించి అభ్యర్థుల సమక్షంలో వారికి చూపించి స్క్రూటినీ చేశారు.

కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డిఆర్‌ఓ అంజయ్య, ఎస్‌డిసి కిషన్‌ రావు, పార్టీల తరఫున ధర్మపురి అరవింద్‌, విద్యాసాగర్‌, లక్ష్మీ నరసయ్య, తిరుపతి వర్మ ఏఆర్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *