కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశం గర్వించదగ్గ మహనీయుల్లో మహాత్మా జ్యోతిబాఫూలే ఒకరని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కులసంఘాలు, బిసి సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. కుల పీడనకు గురైన సమాజం, బానిసత్వం నుంచి అణగారిన ప్రజలను విముక్తి చేసేందుకు ఆయన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. శూద్ర, అతిశూద్ర, స్త్రీ, రైతు, శ్రామిక, పీడిత వర్గాల కోసం సత్యశోధన దృక్పథంతో ఆయన ...
Read More »Daily Archives: April 13, 2019
నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం జనహితలో మిషన్ భగీరథ శాఖ, మునిసిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కంట్రోల్సెల్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 84682 20072 నెంబరు నీటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని తెలిపారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మునిసిపాలిటిల్లో నీటి సమస్య తెలుసుకొని సమస్యాత్మక ప్రాంతాలను ...
Read More »ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల రాస్తారోకో
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు శనివారం కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు రాక మూడునెలలు గడుస్తుందని, అయినా అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గర్హనీయమన్నారు. కార్మికులకు పనిభారం పెరుగుతుందని, వంద పడకలు పెరిగినా వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ...
Read More »జలియన్ వాలాబాగ్ అమరవీరులకు నివాళి
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్‌లో బ్రిటీష్ వారి కాల్పుల్లో అమరులైన వారికి ఎంసిపిఐయు, ఏఐఎప్డిఎస్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. పంజాబ్‌లోని అమృత్సర్ లోని జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా చర్చించుకుంటున్న భారత స్వాతంత్రోద్యమ వీరులపై బ్రిటీష్ కమాండర్ జనరల్ డయ్యర్ ఆదేశాల మేరకు పోలీసులతో చుట్టుముట్టి 1600 మందిని కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగి నేటికి వందసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమరవీరులకు నివాళులు ...
Read More »వెల్లి విరిసిన మత సామరస్యం
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి పట్టణంలో శనివారం శ్రీరామ నవమి పురస్కరించుకొని నిర్వహించిన శ్రీరామశోభాయాత్రలో మతసామరస్యం వెల్లివిరిసింది. కాషాయమయమైన కామారెడ్డి ముస్లిం సోదరులు పాల్గొని మతసామరస్యం చాటుకున్నారు. శోభాయాత్ర సందర్భంగా హైందవ సోదరులను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని వేడుకల్లో పాల్గొన్నారు. కామారెడ్డి మతసామరస్యానికి ఎందుకు ప్రతీకగా నిలుస్తుందో మరోసారి హిందూ, ముస్లిం సోదరులు చాటిచెప్పారు.
Read More »కాషాయమయమైన కామారెడ్డి
కన్నులపండువగా శ్రీరామశోభాయాత్ర కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామనవమిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన శ్రీరామశోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. కామారెడ్డి పట్టణం కాషాయమయమైంది. పట్టణంలో తొలిసారి పద్నాలుగు అడుగుల రాముని విగ్రహాన్ని తయారుచేయించి అంగరంగ వైభవంగా ఊరేగించారు. సాయంత్రం వేళ స్థానిక ధర్మశాల నుంచి రైల్వే వంతెన నిజాంసాగర్ చౌరస్తా మీదుగా ప్రధాన వీదుల గుండా శోభాయాత్ర జరిపారు. పార్టీలకు అతీతంగా శోభాయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ...
Read More »కూనేపల్లి శివాలయంలో అభిషేకం
రెంజల్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కూనేపల్లి గ్రామంలోని శివాలయంలో శివలింగం ప్రతిష్టించి 41రోజులు పూర్తవుతున్న సందర్భంగా గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో మండల పూజ నిర్వహించారు. గంగాజలంతో అభిషేకించారు. ఈ సందర్భంగా మహిళలు గంగాజలాలు తీసుకొచ్చి శివలింగానికి పూజలు చేశారు. కార్యక్రమంలో కిష్టారెడ్డి, లింగం, బుజ్జిసేట్, రాంరెడ్డి, దేవిదాస్, సాయిలు, తదితరులున్నారు.
Read More »14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు జరుగు అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తన ఛాంబర్లో పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా అగ్నిమాపక దళ దినోత్సవం జరుపబడుతుందని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్ని మాపక అధికారి మురళి ...
Read More »అలరించిన కుస్తీపోటీలు
రెంజల్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలోని కందకుర్తి గ్రామంలో శనివారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని కుస్తీపోటీలు నిర్వహించారు. తరతరాలుగా ఆనవాయితీగా పోటీలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కుస్తీపోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మల్లయోధులు వచ్చారు. గ్రామసర్పంచ్ కలిమ్ బేగ్, మండల పోలీసుల బందోబస్తు నడుమ కుస్తీపోటీలు ప్రశాంతంగా ముగిశాయి. కుస్తీపోటీలకు మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా పూసత్ గ్రామానికి చెందిన యువతి మహిమ రాథోడ్, కోప్పర్గ గ్రామానికి చెందిన శ్రీనుతో తలపడగా మహిమ ...
Read More »పల్లకి సేవలో సీతారాముల ఊరేగింపు
బీర్కూర్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీతారాముల కళ్యాణ వేడుకలో భాగంగా శనివారం బీర్కూరు మండల కేంద్రంలో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీరామ ఆలయం నుండి సీతారాములను, హనుమంతుని పల్లకి సేవలో కూర్చోబెట్టి ఊరంతా వీధి వీధిన శోభాయాత్ర నిర్వహించామని బీర్కుర్ సర్పంచ్ ఆవారి స్వప్న, గంగారం అన్నారు. ప్రతి ఏడాది చైత్ర శుద్ధి నవమి వసంతపు రోజులలో శ్రీరామనవమి వేడుకలను మహిళలు, చిన్నా, పెద్దలతో ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపార. పలు గ్రామాలలో శ్రీరామనవమిని రెండు రోజులు జరుపుకుంటారనీ తెలిపారు. ఉదయం ...
Read More »