Breaking News

14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ఏప్రిల్‌ 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు జరుగు అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తన ఛాంబర్‌లో పోస్టర్‌, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 14న దేశ వ్యాప్తంగా అగ్నిమాపక దళ దినోత్సవం జరుపబడుతుందని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

కార్యక్రమంలో జిల్లా అగ్ని మాపక అధికారి మురళి మనోహర్‌ రెడ్డి, సహాయ అగ్నిమాపక అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *