Breaking News
నివాళులు అర్పిస్తున్న నేతలు

జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరులకు నివాళి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సంగ్రామంలో జలియన్‌ వాలాబాగ్‌లో బ్రిటీష్‌ వారి కాల్పుల్లో అమరులైన వారికి ఎంసిపిఐయు, ఏఐఎప్‌డిఎస్‌ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లోని జలియన్‌వాలాబాగ్‌లో స్వాతంత్య్రం కోసం శాంతియుతంగా చర్చించుకుంటున్న భారత స్వాతంత్రోద్యమ వీరులపై బ్రిటీష్‌ కమాండర్‌ జనరల్‌ డయ్యర్‌ ఆదేశాల మేరకు పోలీసులతో చుట్టుముట్టి 1600 మందిని కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంఘటన జరిగి నేటికి వందసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించినట్టు తెలిపారు. ఘటన తర్వాత భారత స్వాతంత్య్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసి పడిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజలింగం, జబ్బర్‌నాయక్‌, తిరుపతి, లీలా, రూప్‌సింగ్‌, మాన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న మునిసిపల్‌ చట్టం 2019 ని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *