Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న పాలనాధికారి

దేశం గర్వించదగ్గ మహనీయుడు జ్యోతిరావు ఫూలే

కామారెడ్డి, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశం గర్వించదగ్గ మహనీయుల్లో మహాత్మా జ్యోతిబాఫూలే ఒకరని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫూలే జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కులసంఘాలు, బిసి సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. కుల పీడనకు గురైన సమాజం, బానిసత్వం నుంచి అణగారిన ప్రజలను విముక్తి చేసేందుకు ఆయన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. శూద్ర, అతిశూద్ర, స్త్రీ, రైతు, శ్రామిక, పీడిత వర్గాల కోసం సత్యశోధన దృక్పథంతో ఆయన ఎంతో సేవచేశారని ప్రశంసించారు.

ఈ విషయాన్ని స్వయంగా గాంధీగారే ఒప్పుకున్నారని చెప్పారు. బ్రిటీష్‌వారి వలస పాలన కాలంలో ఉద్భవించిన వివిధ సాంఘిక సంస్కరణ, రాజకీయ ఉద్యమాలకు భిన్నంగా సామాజిక న్యాయం, ధ్యేయంతో ఫూలే మరో ప్రత్యామ్నాయ తరహా ఉద్యమాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. సమాజం వెలివేసిన పిల్లలకు ఆయన చదువు చెప్పారన్నారు. స్త్రీలకు విద్యనేర్పారని, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి బాల్య వివాహాలు, వితంతువుల పట్ల దురాచారాలను అరికట్టేందుకు పోరాటాలు చేశారని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Check Also

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *