Breaking News

కాషాయమయమైన కామారెడ్డి

కన్నులపండువగా శ్రీరామశోభాయాత్ర

కామారెడ్డి, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన శ్రీరామశోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. కామారెడ్డి పట్టణం కాషాయమయమైంది. పట్టణంలో తొలిసారి పద్నాలుగు అడుగుల రాముని విగ్రహాన్ని తయారుచేయించి అంగరంగ వైభవంగా ఊరేగించారు.

సాయంత్రం వేళ స్థానిక ధర్మశాల నుంచి రైల్వే వంతెన నిజాంసాగర్‌ చౌరస్తా మీదుగా ప్రధాన వీదుల గుండా శోభాయాత్ర జరిపారు. పార్టీలకు అతీతంగా శోభాయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *